iDreamPost
android-app
ios-app

బాహుబలి ‘కట్టప్ప’ తో స్పెషల్ మూవీ !

  • Published Sep 26, 2025 | 1:38 PM Updated Updated Sep 26, 2025 | 1:38 PM

రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. తెలుగు సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని మాట్లాడుకునేలా చేసింది. ఆ సినిమాలో బాహుబలి , భల్లాలదేవ ఎలా పాపులర్ అయ్యారో కట్టప్ప కూడా అలానే పాపులర్ అయ్యాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. తెలుగు సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని మాట్లాడుకునేలా చేసింది. ఆ సినిమాలో బాహుబలి , భల్లాలదేవ ఎలా పాపులర్ అయ్యారో కట్టప్ప కూడా అలానే పాపులర్ అయ్యాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

  • Published Sep 26, 2025 | 1:38 PMUpdated Sep 26, 2025 | 1:38 PM
బాహుబలి ‘కట్టప్ప’ తో స్పెషల్ మూవీ !

ప్రతిసారి కొత్త కథలు సృష్టించడం కాస్త కష్టమే . అందుకే ఈ మధ్య దర్శకులు మన కథలనే కాస్త డిఫరెంట్ గా మనకే చూపిస్తున్నారు. తీసిన సినిమాలకే సిక్వెల్స్ , ప్రిక్వెల్స్ తీస్తూ వరల్డ్ బిల్డింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు వీటిలో నుంచే మరో కొత్త కథ పుట్టుకురానుంది. రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. తెలుగు సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని మాట్లాడుకునేలా చేసింది.

ఆ సినిమాలో బాహుబలి , భల్లాలదేవ ఎలా పాపులర్ అయ్యారో కట్టప్ప కూడా అలానే పాపులర్ అయ్యాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దానికి బాహుబలి 2 తీసేసి కంక్లూజన్ ఇచ్చేసాడు జక్కన్న. అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు మళ్ళీ అందరు కట్టప్ప గురించి మాట్లాడుకునేల చేయబోతున్నారట ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడు రైటర్ విజయేంద్ర ప్రసాద్ , డైరెక్టర్ రాజమౌళి కలిసి.. కట్టప్ప పాత్రతో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నారట.

మాహిష్మతి సామ్రాజ్యంలో కట్టప్ప ఎందుకు నమ్మిన బంటుగా ఉన్నాడు? అతని చరిత్ర ఏమిటి? తన కుటుంబ ఏంటి? ఎందుకు బానిసగా ఉండాల్సి వచ్చింది..? వీటి చుట్టూ కథ ఉండబోతుందట. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ గా రాజమౌళి చేస్తారా లేదా ఈ కథ ఇంకే దర్శకుడికైనా ఇస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ . కానీ ఆల్రెడీ కట్టప్ప ప్రీ విజువలైజేషన్ వర్క్ మాత్రం స్టార్ట్ అయిందట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.