iDreamPost
android-app
ios-app

Salaar Movie: సలార్ కు జక్కన్న సాయం.. ప్రభాస్ కోసం రాజమౌళి

  • Published Dec 14, 2023 | 2:22 PM Updated Updated Dec 14, 2023 | 2:22 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది. సలార్ కోసం జక్కన్న రంగంలోకి దిగుతున్నారట. ఆ వివరాలు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది. సలార్ కోసం జక్కన్న రంగంలోకి దిగుతున్నారట. ఆ వివరాలు..

  • Published Dec 14, 2023 | 2:22 PMUpdated Dec 14, 2023 | 2:22 PM
Salaar Movie: సలార్ కు జక్కన్న సాయం.. ప్రభాస్ కోసం రాజమౌళి

ప్రభాస్ అభిమానులు మాత్రమే కాక పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తోన్న సినిమా సలార్. ఈ నెల అనగా డిసెంబర్ 22, 2023న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వారం రోజుల్లో సినిమా విడుదల రిలీజ్ కాబోతున్నప్పటికి చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండా విడుదల కాబోతున్న.. చిత్రం సలార్ మాత్రమే కానుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాను ఇలా ట్రీట్ చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ మూవీ యూనిట్ మాత్రం సలార్ చిత్రంతో ఏదో ప్రయోగం చేసే పనిలో ఉందని భావిస్తున్నారు అభిమానులు.

ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. సలార్ కోసం జక్కన్న రంగంలోకి దిగుతున్నారంట. ప్రభాస్ కి రాజమౌళి సాయం చేయబోతున్నారట. అంటే.. సలార్ ప్రమోషన్స్ లో జక్కన్న భాగం కాబోతున్నారంట. ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌లను రాజమౌళి ఇంటర్వ్యూ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. దీన్ని యూట్యూబ్‌లో షేర్ చేయాలని హోంబలే ఫిల్మ్స్ నిర్ణయించింది. ఇక ఈ ఇంటర్వ్యూలో సలార్ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో రాజమౌళి రాధే శ్యామ్ విడుదల సందర్భంగా ప్రభాస్ ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

ఇక దర్శకుడు రాజమౌళి, ప్రభాస్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు చేసిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమాలతో ప్రభాస్‌కు భారీ విజయాన్నిమాత్రమే కాక పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ ని అందించిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. అందుకే ప్రభాస్ కు రాజమౌళి అంటే ప్రత్యేక గౌరవం. అలానే జక్కన్న కూడా ప్రభాస్‌ని తన క్లోజ్ ఫ్రెండ్‌గా భావిస్తాడు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

ఇక ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2’ విడుదలై చాలా ఏళ్లు గడిచాయి. ఆ తర్వాత ఆయన నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఏ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోలేదు. దాంతో ప్రభాస్ నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక డార్లింగ్ కూడా సలార్ తో సక్సెస్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు రాజమౌళి సాయం కూడా తోడవ్వనుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

‘హోంబాలే ఫిలింస్’ ద్వారా భారీ బడ్జెట్‌తో రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరగందురు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు తదితరులు నటించారు. రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్, ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss