iDreamPost
android-app
ios-app

దేవర రైట్స్ రాజమౌళి కొడుకు చేతికి! అక్కడ తారక్ క్రేజ్ అలాంటిది!

  • Published Aug 03, 2024 | 6:17 PM Updated Updated Aug 03, 2024 | 6:17 PM

Devara Movie Update: కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న 'దేవర' చిత్రం నుంచి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన ఓ స్పెషల్ అప్ డేట్ వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Devara Movie Update: కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న 'దేవర' చిత్రం నుంచి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన ఓ స్పెషల్ అప్ డేట్ వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 03, 2024 | 6:17 PMUpdated Aug 03, 2024 | 6:17 PM
దేవర రైట్స్ రాజమౌళి కొడుకు చేతికి! అక్కడ తారక్ క్రేజ్ అలాంటిది!

తారక్ ను ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం విడుదలకు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా ప్రతి అప్ డేట్ సినిమాపై రోజు రోజుకి అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక దేవర పార్ట్-1 ను సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన ఓ స్పెషల్ అప్ డేట్ వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

దేవర రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. మూవీ రీలీజ్ కు సంబంధించిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దేవర సినిమాలో రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా భాగస్వామ్యం కానున్నారు. దాదాపు రాజమౌళి తీసే సినిమాలన్నిటికీ కూడా కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తారన్న సంగతి తెలియనిది కాదు. ఇక ఇటీవల థియేటర్ లో హడావిడి చేసిన ప్రేమలు సినిమాతో అతను డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. తాజాగా దేవర కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నట్లు.. కారికేయ తెలిపారు. “అతని ఫోర్ట్. అతని ఎదుగుదల. అతని విజయం… అంతా నా తారక్ అన్న ప్రేమ కోసం. దేవర కెవిఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి దేవర చిత్రాన్ని కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.” అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ ప్రకటించారు.

ఇక ఈ సినిమానే కాకుండా.. కార్తికేయ ‘ఆక్సిజన్‌’ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ అనే చిత్రాలను కూడా నిర్మిస్తున్నట్లు గతంలో తెలియజేశారు. ఇక దేవర విషయానికొస్తే.. ఇలా ఒక్కొక్కటిగా వస్తున్న అప్ డేట్ అభిమానులకు మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఇప్పటికే హైప్ ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో వచ్చే అప్ డేట్స్ కు..  ఎలాంటి క్రేజ్ క్రియేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ మూవీ ఏ మేరకు అందరి అంచనాలను అందుకుంటుందో వేచి చూడాల్సిందే.  దేవర మూవీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను కార్తికేయ సొంతం చేసుకున్న.. విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetHoliganbet girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş