iDreamPost
android-app
ios-app

SSMB29: మహేశ్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్ టైటిల్ గరుడ?

  • Published Aug 23, 2024 | 10:13 PM Updated Updated Aug 23, 2024 | 10:13 PM

SSMB29 Movie Title Garuda: మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 29కి సంబంధించి క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ టైటిల్ కన్ఫామ్ అయిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి.

SSMB29 Movie Title Garuda: మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 29కి సంబంధించి క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ టైటిల్ కన్ఫామ్ అయిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి.

  • Published Aug 23, 2024 | 10:13 PMUpdated Aug 23, 2024 | 10:13 PM
SSMB29: మహేశ్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్ టైటిల్ గరుడ?

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈయన ప్రాజెక్ట్ గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ తప్ప.. మూవీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. కానీ, లీకులు మాత్రం వస్తూనే ఉన్నాయి. సాధారణంగా లీకులు అంటే వాళ్లు వీళ్లు చేసింది కాదండోయ్.. ఇది ఏకంగా సినిమా క్రూలో ఉండే వాళ్లే చేశారు. అది కూడా ఏకంగా టైటిల్ కి సంబంధించి కావడంతో మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎస్ఎస్ఎస్ఎంబీ 29కి గరుడ టైటిల్ పెట్టారని పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.

మహేశ్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్ కి సంబంధించి మహేశ్ ఫ్యాన్స్ కాస్త డీలా పడిన విషయం తెలిసిందే. ఎందుకంటే మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఎందుకంటే ఇంకా ఈ ప్రాజెక్ట్ పనులు ప్రీ ప్రొడక్షన్ లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా టైటిల్ కి సంబంధించి లీకులు రావడంతో అంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. ఆ లీకులు ఇచ్చింది మరెవరో కాదు.. విజువల డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఈ వార్తలకు ఊతం ఇచ్చింది. టీపీ విజయన్ తన ఇన్ స్టా స్టోరీలో గోల్డెన్ ఈగల్ వింగ్స్ ని పోస్ట్ చేశాడు. వాటికి #SSMB29, #SSMB29Dairies అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టాడు. ఇంకేముంది.. అంతా ఇది మహేశ్ బాబు- రాజమౌళి సినిమాకి టైటిల్ అని అంతా ఫిక్స్ అయిపోయారు.

rajamouli mahesh babu movie

ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మహేశ్ మూవీకి రాజమైళి గరుడ అని టైటిల్ పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి తర్వాత రాజమౌళి గరుడ అనే ప్రాజెక్ట్ గురించి కామెంట్స్ చేశాడు. బహుబలి తర్వాత తన మదిలో ఉన్న ప్రాజెక్ట్ గరుడ అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ ప్రాజెక్ట్.. ఈ ప్రాజెక్ట్ ఒకటా కాదా? అనేది మాత్రం క్లారిటీ రావాల్సిం ఉంది. అప్పటి నుంచి అనుకున్న తర్వాత ఇప్పుడు పట్టాలెక్కించాడా? అనేది మాత్రం అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు. ప్రస్తుతానికి మహేశ్ ఫ్యాన్స్ మాత్రం ఎస్ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ టైటిల్ మాత్రం గరుడ అని ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా.. నెట్టింట కొత్త కొత్త పోస్టర్స్ కూడా తయారు చేస్తున్నారు. మరి.. మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ టైటిల్ ‘గరుడ’ అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet