iDreamPost
android-app
ios-app

గామి చిత్ర యూనిట్ ను మెచ్చుకున్న రాజమౌళి

  • Published Mar 06, 2024 | 9:22 PM Updated Updated Mar 06, 2024 | 9:23 PM

బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్ చిత్రాల ద్వారా తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శకధీరుడిగా రాజమౌళికి ఎనలేని గౌరవం దక్కింది. కేవలం తను తీసే సినిమాల పై మాత్రమే కాకుండా ఇతర సినిమాలు ఏవైనా క్రియేటివ్ గా కనిపిస్తే అభినందించడం ఆయనకు అలవాటు.

బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్ చిత్రాల ద్వారా తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శకధీరుడిగా రాజమౌళికి ఎనలేని గౌరవం దక్కింది. కేవలం తను తీసే సినిమాల పై మాత్రమే కాకుండా ఇతర సినిమాలు ఏవైనా క్రియేటివ్ గా కనిపిస్తే అభినందించడం ఆయనకు అలవాటు.

  • Published Mar 06, 2024 | 9:22 PMUpdated Mar 06, 2024 | 9:23 PM
గామి చిత్ర యూనిట్ ను మెచ్చుకున్న రాజమౌళి

ఎస్ ఎస్ రాజమౌళి అనే పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు, ఆ మాటకొస్తే భారతీయ సినీ ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్ చిత్రాల ద్వారా తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శకధీరుడిగా రాజమౌళికి ఎనలేని గౌరవం దక్కింది. కేవలం తను తీసే సినిమాల పై మాత్రమే కాకుండా ఇతర సినిమాలు ఏవైనా క్రియేటివ్ గా కనిపిస్తే అభినందించడం ఆయనకు అలవాటు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తాలూకు ప్రీ ప్రొడక్షన్ వర్కులో బిజీగా ఉన్న రాజమౌళి, గామి చిత్ర యూనిట్ ను అభినందించారు. కాగా ఆ చిత్రం ట్రైలర్ సాంకేతికంగా అద్భుతంగా ఉందని అన్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాజమౌళి గామి పై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు: అసాధ్యమైన కలలు కనడం… కానీ వాటిని నిజం చేయడానికి అహర్నిశలు కష్టపడటం… గామి సినిమాకి అందరినీ ఇంతలా ఆకట్టుకునే విజువల్స్ సాధించడంలో నిర్మాత కార్తీక్, దర్శకుడు విద్యాధర్ నన్ను కలిసి నాలుగేళ్లుగా వారు చేసిన కృషి గురించి చెప్పినప్పుడు నాకు అదే అనిపించింది. మార్చి 8న విడుదలవుతున్న ‘గామి’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని అన్నారు.

మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గామి సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలయిన ప్రమోషనల్ కంటెంట్ వల్ల ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడంతో సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న గామి టీమ్ ని రాజమౌళి అభినందించడం ఖచ్చితంగా వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్న ఈ సినిమాని నూతన దర్శకుడు విద్యాధర్ కగితా తెరకెక్కించారు. చాందిని చౌదరి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా మరి కొందరు కూడా సహకారం అందించారు. మరి గామి సినిమా కోసం చిత్ర బృందం పడిన కష్టం వృధా కాకుండా రాజమౌళి మెచ్చుకున్నట్లుగానే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిద్దాం.

గామి యూనిట్ కి రాజమౌళి హ్యాట్సాఫ్!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetgrandpashabet girişjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobet