iDreamPost
android-app
ios-app

జవాన్‌ దర్శకుడు అట్లీపై రాజారాణి నటి సంచలన ఆరోపణలు!

  • Published Sep 13, 2023 | 7:01 PM Updated Updated Sep 13, 2023 | 7:01 PM
  • Published Sep 13, 2023 | 7:01 PMUpdated Sep 13, 2023 | 7:01 PM
జవాన్‌ దర్శకుడు అట్లీపై రాజారాణి నటి సంచలన ఆరోపణలు!

షారుఖ్‌ ఖాన్‌ హీరోగా.. విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించిన ‘జవాన్‌’ సినిమా సాధించిన విజయంతో అట్లీ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగుతోంది. ఇలాంటి ఈ సమయంలో అట్లీపై ప్రముఖ హీరోయిన్‌ ప్రియమణి సంచలన ఆరోపణలు చేశారు. ప్రియమణి మాట్లాడుతూ.. ‘‘ జవాన్ తమిళ వెర్షన్‌లో దళపతి విజయ్.. తెలుగు వెర్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌లు కేమియోలో నటిస్తున్నారన్న టాక్‌ వినిపించింది. దీంతో నేను అట్లీ దగ్గరికి వెళ్లి.. విజయ్ తో ఓ సీన్‌ చేస్తానని అడిగాను.

అట్లీ అందుకు ఓకే చెప్పాడు. సినిమా చివరి దా​కా ఆ విషయంలో నన్ను అట్లీ మోసం చేస్తూ వచ్చారు. వారిద్దరూ సినిమాలో నటించలేదు’’ అని అన్నారు. ఈ కామెంట్ల వేడి తగ్గక ముందే ఓ నటి కూడా అట్లీపై ఆరోపణలు చేశారు. రాజారాణిలో ఓ చిన్న పాత్రలో కనిపించిన సాక్షి అగర్వాల్‌ అనే నటి కూడా అట్లీ తనను మోసం చేశాడని ఆరోపిస్తోంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రాజారాణి సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. కొన్ని సెకన్లు కనిపించే సీన్‌ కాబట్టి.. స్టోరీ నాకు చెప్పలేదు.

నేను కూడా పెద్దగా ఆలోచించకుండా నటించేశాను. సినిమా విడుదల అయిన తర్వాత నా పాత్రను చూసుకుని, అది వచ్చే సందర్భం తెలుసుకుని బాధపడ్డాను. సీన్‌ కాంటెక్ట్స్‌ ఏంటన్నది వివరించకుండా కొత్త వాళ్లకు ఇలాంటి పాత్రలు ఇవ్వటం మంచిది కాదు. ఇవే నటులకు.. దర్శకులకు మధ్య వివాదాలను తెచ్చిపెడుతాయి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి, అట్లీ తమను మోసం చేశాడంటూ ప్రియమణి, సాక్షి అగర్వాల్‌లు ఆరోపణలు చేయటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom