iDreamPost
android-app
ios-app

వీడియో: లైవ్ డిబేట్ లో శేఖర్ బాషాని చెప్పుతో కొట్టిన లావణ్య!

  • Published Aug 01, 2024 | 9:49 PM Updated Updated Aug 01, 2024 | 9:49 PM

Raj Tarun Friend Shekar Basha vs Lavanya In A Live Debate: రాజ్ తరుణ్- లావణ్యల వివాదం కేసులు ప్రతి కేసుల దాకా వెళ్లింది. అయితే ఈ సీన్ లోకి ఎంటర్ అయిన శేఖర్ బాషా- లావణ్యల మధ్య కూడా పెద్ద యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ డిబేట్ లో అయితే లావణ్య అతడిని చెప్పుతో కొట్టింది.

Raj Tarun Friend Shekar Basha vs Lavanya In A Live Debate: రాజ్ తరుణ్- లావణ్యల వివాదం కేసులు ప్రతి కేసుల దాకా వెళ్లింది. అయితే ఈ సీన్ లోకి ఎంటర్ అయిన శేఖర్ బాషా- లావణ్యల మధ్య కూడా పెద్ద యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ డిబేట్ లో అయితే లావణ్య అతడిని చెప్పుతో కొట్టింది.

  • Published Aug 01, 2024 | 9:49 PMUpdated Aug 01, 2024 | 9:49 PM
వీడియో: లైవ్ డిబేట్ లో శేఖర్ బాషాని చెప్పుతో కొట్టిన లావణ్య!

రాజ్ తరుణ్- లావణ్యల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుని మోసం చేశాడని.. అబార్షన్ కూడా చేయించాడని లావణ్య వాదిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రాజ్ తరుణ్- హీరోయిన్ మాల్వి మల్హోత్రలపై కేసు కూడా పెట్టింది. అయితే రాజ్ తరుణ్ మాత్రం లావణ్య చేసేవన్నీ ఆరోపణలే అంటూ కొట్టి పారేస్తున్నాడు. అలాగే తిరగబడరాసామి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. కోర్టులో ఫైట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హైకోర్టుల ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. అలాగే రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రా కూడా లావణ్య మీద కేసులు పెట్టారు. అయితే ఈ మొత్తం స్టోరీలోకి శేఖర్ బాషా ఎంటర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ శేఖర్ బాషాను లావణ్య లైవ్ లో చెప్పుతో కొట్టింది.

ప్రస్తుతం లావణ్య- రాజ్ తరుణ్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో కూడా వీళ్ల గురించే పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. బుధవారం ప్రసాద్ ల్యాబ్స్ లో తిరగబడరాసామి ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దకు వచ్చిన లావణ్య తనకు న్యాయం కావాలి అంటూ నిరసనకు దిగింది. పోలీసులు బలవంతంగా ఆమెను అక్కడి నుంచి పంపేశారు. అలాగే వాళ్లు ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. రాజ్ తరుణ్ అయితే తన వద్ద ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం సినారియోలోకి రాజ్ తరుణ్ మిత్రుడిగా చెప్పుకుంటున్న శేఖర్ బాషా కూడా ఎంటర్ అయ్యాడు. ఇలాంటి ఆడవాళ్ల నుంచి మగాళ్లకు రక్షణ కావాలి అంటూ అతను డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్లు ఇద్దరినీ పెట్టి ఒక ఛానల్ లైవ్ డిబేట్ ప్లాన్ చేసింది. ఆ డిబేట్ లో శేఖర్ బాషా అన్న మాటలకు సహనం కోల్పోయిన లావణ్య చెప్పుతో కొట్టింది.

లావణ్య- శేఖర్ బాషా ఇద్దరూ లైవ్ డిబేట్ లో పాల్గొన్నారు. ఈ డిబేట్ లో ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఇద్దరూ కూడా ఒకరు మాట్లాడుతుంటే ఒకరు అడ్డు పడుతూ వచ్చారు. అలాగే శేఖర్ బాషా అయితే లావణ్య మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు. చిన్న పిల్లలకు మాదకద్రవ్యాలు అలవాటు చేసింది అంటూ ఆరోపించాడు. రెండుసార్లు ఆ మాటలు అనగానే కోపంతో లావణ్యం తన చెప్పు తీసి శేఖర్ బాషా మీదకు విసిరింది. అయితే శేఖర్ బాషా కూడా అంతే తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. లావణ్య మీదకు దూసుకెళ్లాడు. ఆమెను శేఖర్ బాషా తోశాడు. ఆమెపై దాడి చేస్తాడేమో అని కంగారుగా ఛానల్ వాళ్ళు అతడిని దూరం జరిపారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmarsbahis girişgrandpashabet