iDreamPost

లైవ్ లో పాటలు పాడటం అబద్ధమా? రాహుల్ సిప్లిగంజ్ చెప్పిన నిజం!

Rahul Sipligunj Comments On Singers Live Performance: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సింగర్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. సింగర్స్ లైవ్ లో చేసే పర్ఫార్మెన్సులకు సంబంధించి అసలు విషయాలు వెల్లడించాడు.

Rahul Sipligunj Comments On Singers Live Performance: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సింగర్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. సింగర్స్ లైవ్ లో చేసే పర్ఫార్మెన్సులకు సంబంధించి అసలు విషయాలు వెల్లడించాడు.

లైవ్ లో పాటలు పాడటం అబద్ధమా? రాహుల్ సిప్లిగంజ్ చెప్పిన నిజం!

భాష ఏదైనా హాలీవుడ్ లో ఉండే ర్యాపర్స్, పాప్ సింగర్స్ నుంచి మన టాలీవుడ్ సింగర్స్, మన జానపదాలు, గజల్స్ వరకు సింగర్స్ కు ఎనలేని ఆదరణ ఉంటుంది. ఒక సినిమా హిట్టు అవ్వాలి అన్నా.. ఒక విషయం ప్రజల్లోకి వెళ్లాలి అన్నా? పాట అనేది మంచి సాధనం అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మాత్రం ఎక్కువగా సినిమా పాటలకు, ఆ పాటలు సింగర్స్ కు మంచి గుర్తింపు లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఇంకా కొత్తవాళ్లు వస్తున్నారు. వస్తూనే ఉంటారు కూడా. అయితే వీళ్లు సినిమాల్లో పాటలు పాడటం మాత్రమే కాకుండా.. స్టేజుల మీద లైవ్ పర్ఫార్మెన్సులు ఇస్తూ ఉంటారు. అది నిజమా కాదా అనే ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. దానికి రాహుల్ సిప్లిగంజ్ ఒక ఆన్సర్ చెప్పేశాడు.

సాధారణంగా మీరు టీవీల్లో గానీ.. రియల్ గా గానీ స్టేజులు మీద లైవ్ పర్ఫార్మెన్సులు చూసే ఉంటారు. అలాగే ఎక్కువగా సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్లు వంటి ఫంక్షన్స్ లో సింగర్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. గతంలో కొంతమంది సాంగ్ వస్తున్నప్పుడు లిప్ మూమెంట్ ఇవ్వకపోవడం, నాన్ సింక్ లో లిప్ కదిలించడం చేసిన ఘటనలు కూడా మనం చూశాం. అప్పుడు ఒక పెద్ద ప్రశ్న అందరి మైండ్ లోకి వస్తూ ఉండేది. అంటే సింగర్స్ స్టేజ్ మీద పాట పాడటం అబద్ధమా అని. అయితే ఆ ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. సాధ్యమైనంత వరకు చెప్పరు కూడా. కానీ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాత్రం ప్రజల్లో ఉన్న మిలియన్ డాలర్ ప్రశ్నకు సమాధానం చెప్పేశాడు.

ఓ చిట్ చాట్ లో పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్ కు ఈ ప్రశ్న ఎదురైంది. హోస్ట్ మాట్లాడుతూ.. నేను ఊ అంటావా పాట పాడుతుండగా సింగర్ ని లైవ్ లో చూశాను. తన లిప్ సింక్ పాటకు తగినట్లు లేదు. నిజంగానే లైవ్ లో పాడతారా? అని హోస్ట్ సిప్లిగంజ్ ను ప్రశ్నించాడు. అందుకు రాహుల్ సిప్లిగంజ్ ఏమాత్రం తొణకకుండా, బెణకకుండా ఉన్నది చెప్పేశాడు. అలాంటి సాంగ్స్ అవుట్ పుట్ రావాలి అంటే చాలానే ఎఫర్ట్స్ ఉంటాయి. చాలా టెక్నాలజీని కూడా వాడాల్సి ఉంటుంది. అలాంటి అవుట్ పుట్ కోసం మీరు ఎక్విప్మెంట్ మొత్తాన్ని తెచ్చి అక్కడ పెట్టలేరు. అందుకే పాటను ప్లే చేస్తారు అని చెప్పాడు.

అక్కడ హోస్ట్ కి ఇంకో అనుమానం వచ్చింది. అదేంటంటే.. విడిగా సాంగ్ ని రికార్డ్ చేసి.. ఇక్కడ ప్లే చేస్తారా అని అడిగాడు. అందుకు ఇంకో దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు. అదేంటంటే.. అలాంటిది ఏమీ ఉండదు. ఒరిజినల్ సాంగ్ నే ప్లే చేస్తారు. వీళ్లని జస్ట్ లిప్ మూమెంట్ ఇవ్వమని చెప్తారు అని ఉన్నది చెప్పేశాడు. ఇంకేముంది.. ఇప్పుడు ఎంతో మంది అడుగుతున్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికేసింది. స్టేజ్ మీద లైవ్ లో పాడే సింగర్స్ అసలు పాడరు అనే విషయాన్ని స్పష్టం చేశాడు. అయితే ఇది అన్నీ పాటలకు అని మాత్రం చెప్పలేదు. ఒకవేళ నార్మల్ సాంగ్స్ కి లైవ్ లో పాడే అవకాశం ఉండచ్చు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి