iDreamPost
android-app
ios-app

రజినీ-లోకేష్‌ల సినిమాలో విలన్‌గా ఆ స్టార్‌ హీరో!

  • Published Nov 04, 2023 | 11:39 AM Updated Updated Nov 04, 2023 | 11:39 AM

సినిమా క్రూ ఎంపిక విషయంలోనూ ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. భారీ తారాగణాన్ని రంగంలోకి దింపుతున్నారు. తాజాగా, తన సినిమాలో రజినీకి విలన్‌గా ఓ స్టార్‌ హీరోను ఎంపిక చేశారు.

సినిమా క్రూ ఎంపిక విషయంలోనూ ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. భారీ తారాగణాన్ని రంగంలోకి దింపుతున్నారు. తాజాగా, తన సినిమాలో రజినీకి విలన్‌గా ఓ స్టార్‌ హీరోను ఎంపిక చేశారు.

  • Published Nov 04, 2023 | 11:39 AMUpdated Nov 04, 2023 | 11:39 AM
రజినీ-లోకేష్‌ల సినిమాలో విలన్‌గా ఆ స్టార్‌ హీరో!

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌- లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో త్వరలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం లోకేష్‌ సినిమా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా కథకోసం ఏకంగా ఆరు నెలల సమయాన్ని ఆయన వెచ్చించనున్నారు. లియో సినిమా కథ విషయంలో చోటుచేసుకున్న తప్పుల్ని రిపీట్‌ కానివ్వకుండా చూడ్డానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. చాలా పగడ్భందీగా కథను సిద్ధం చేస్తున్నారు.

సినిమా క్రూ ఎంపిక విషయంలోనూ ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. భారీ తారాగణాన్ని రంగంలోకి దింపుతున్నారు. తాజాగా, తన సినిమాలో రజినీకి విలన్‌గా ఓ స్టార్‌ హీరోను ఎంపిక చేశారు. లోకేష్‌ సినిమాలో రాఘవా లారెన్స్‌-రజినీతో పోటీ పడనున్నారట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.  కాగా, లోకేష్‌-విజయ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’కు మిశ్రమ స్పందన వచ్చింది. లియో కలెక్షన్లపై గత కొద్దిరోజుల నుంచి వివాదం నెలకొంటూ ఉంది.

లియో సినిమా టీం కలెక్షన్ల విషయంలో మోసానికి పాల్పడుతోందని తమిళనాడు సినిమా థియేటర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. దాదాపు 5 కోట్ల రూపాయల స్కాం చేసిందని ఆరోపించారు. పలు సినిమా థియేటర్ల యజమానులు సైతం సుబ్రమణియన్‌కు మద్దతుగా నిలిచారు. ఇక, ఈ వివాదంపై స్పందించిన లోకేష్‌.. తన సినిమా సెకండ్‌ హాఫ్‌ బాలేదని తనకు ఫీడ్‌ బ్యాక్‌ వచ్చినట్లు తెలిపారు. అంతేకాదు! సినిమా కలెక్షన్ల విషయంతో తనకు సంబంధం లేదని, అది నిర్మాతలు చూసుకుంటారని అన్నారు. మరి, రజినీ-లోకేష్‌ల సినిమాలో రాఘవా లారెన్స్‌ విలన్‌గా నటించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss