iDreamPost

Raghava Lawrence: సాయం చేయడంలో తండ్రికి మించిన లారెన్స్ కుమారుడు!

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్ట్, నటుడు రాఘవ లారెన్స్‌ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కష్టాల్లో ఉన్న వారికి తనవంతుగా సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా లారెన్స్ తన కుమారుడిని అందరికి పరిచయం చేశారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్ట్, నటుడు రాఘవ లారెన్స్‌ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కష్టాల్లో ఉన్న వారికి తనవంతుగా సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా లారెన్స్ తన కుమారుడిని అందరికి పరిచయం చేశారు.

Raghava Lawrence: సాయం చేయడంలో తండ్రికి మించిన లారెన్స్ కుమారుడు!

నేటికాలంలో సంపాదించాలనే ధ్యాసే తప్ప..సాయం చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎక్కువ మంది తమ వారసుల కోసం ఆస్తులు కూడబెట్టే పనిలో ఉంటారు. ఇక వారి పిల్లలు కూడా మరింత ధనం సమకూర్చుకునే పనిలో ఉంటారు. కానీ కొందరు మాత్రం తాము ఇతరులకు దానం చేస్తూనే…అదే గుణాన్ని తన పిల్లలకు నేర్పిస్తారు. అలాంటి సాయం చేసే గుణం ఉన్న వ్యక్తుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన కుమారుడిని కూడా అందరికి పరిచయం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్ట్, నటుడు రాఘవ లారెన్స్‌ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కష్టాల్లో ఉన్న వారికి తనవంతుగా సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తన తల్లిగారి పేరుతో ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేసి తమిళనాడులో ఎందరికో సాయం చేశారు. గుండెజబ్బుతో బాధపడుతున్నఎంతో మంది చిన్నారులకు ఆపరేషన్లు చేయించి..తన మంచి మనసు చాటుకున్నారు. అదేవిధంగా చాలా మంది పేదలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఉపాధి కల్పించారు. ట్రాక్టర్స్‌,బైక్స్‌,ఆటోలు, తోపుడు బండ్లు, వికలాంగులకు వాహనాల.. ఇలా చెప్పుకుంటూ పోతే.. లారెన్స్‌ చేసిన సాయం ఎంతో ఉంది.

చాలా మంది సినీ సెలబ్రిటీలు తమ బిడ్డలను ఇండస్ట్రీకి పరిచయం చేద్దామా అని చూస్తుంటారు. కానీ లారెన్స్‌ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇతరులకు సాయం చేసే తన సేవా గుణాన్ని వారసత్వంగా తన కొడుకు ఇచ్చారు. చిన్న వయసు నుంచే ఇతరులకు సాయం చేసే అలవాటును కొడుకు పరిచయం చేశారు.  ఇలా కుమారుడిని పరిచయం చేసే క్రమంలో లారెన్స్‌ ఒక వీడియో షేర్ చేశాడు.  తన కుమారుడిని అభిమానులకు, స్నేహితులకు  పరిచయం చేస్తూ.. కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. శామ్ ప్రస్తుతం కాలేజీలో 3వ  ఏడాది చదువుతూ పార్ట్‌టైమ్ జాబ్‌లో కూడా పనిచేస్తున్నాడని లారెన్స్ తెలిపారు.

గత పదేళ్లుగా తాను హెప్సిబా అనే అమ్మాయి చదువు కోసం నా వంతు డబ్బు సాయం చేస్తున్నానని, ఇక నుంచి ఆ  అమ్మాయికి శామ్ సాయం చేస్తాడని తెలిపాడు. ఇలా ఈ సంతోషకరమైన క్షణాన్ని అందరితో పంచుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని లారెన్స్ అన్నారు. ఇక నుంచి శ్యామ్ తన సేవా యాత్రను కొనసాగిస్తాడని, దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలని లారెన్స్‌ కోరారు. మరి..ఇలా వారుసులకు కూడా సేవాగుణం నేర్పుతున్న రాఘవ లారెన్స్ పై మీ  అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి