iDreamPost
android-app
ios-app

కంగనా గన్‌మెన్లపై లారెన్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Published Sep 23, 2023 | 9:01 PM Updated Updated Sep 23, 2023 | 9:01 PM
  • Published Sep 23, 2023 | 9:01 PMUpdated Sep 23, 2023 | 9:01 PM
కంగనా గన్‌మెన్లపై లారెన్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘చంద్రముఖి’ది ఓ ప్రత్కేక స్థానం. 2005లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత దర్శకుడు పి. వాసు చం‍ద్రముఖి సీక్వెల్‌ను సిద్దం చేశారు. చంద్రముఖి 2గా తెరెకెక్కిన సీక్వెల్‌లో రాఘవ లారెన్స్‌లో హీరోగా నటించారు. చంద్రముఖి 2లో చంద్రముఖి పాత్రను ‘కంగనా రనౌత్‌’ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్‌28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా బృందం ప్రమోషన్లో బిజీ అయిపోయింది.

శనివారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్‌.. కంగనా రనౌత్‌పై.. ఆమె గన్‌మెన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లారెన్స్‌ మాట్లాడుతూ.. ‘‘ కంగనాతో నటించటం సంతోషంగా ఉంది. కానీ, మొదట్లో చాలా భయం వేసేది. ఎప్పుడూ ఆమెతో ఓ ఐదుగురు గన్‌మెన్లు ఉండేవారు. ఆమె సెట్‌కు నవ్వుతూనే వచ్చేవారు. కానీ, ఆ గన్‌మెన్‌లు అస్సలు నవ్వేవారు కాదు. నాకు హిందీ రాదు కాబట్టి.. ఆమెతో మాట్లాడేటప్పుడు భయపడేవాడ్ని.

ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ మారిందంటే.. వాళ్లు గన్‌లు మా వైపు తిప్పుతారేమోనని భయం వేసేది. గన్‌మెన్లను పక్కకు పంపించమని అడిగాను. ఆమె ఓకే అ‍న్నారు. అప్పటినుంచి ఫ్రీగా మాట్లాడుకునేవాళ్లం. తర్వాత మా ఇద్దరి మధ్యా స్నేహం పెరిగింది’’ అని చెప్పుకొచ్చారు. కాగా, భద్రతా కారణాల దృష్ట్యా కంగనాకు కేంద్ర ప్రభుత్వం ఐప్లస్‌ క్యాటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. మరి, కంగనా రనౌత్‌ గన్‌మెన్లపై రాఘవ లారెన్స్‌ కామెంట్లు చేయటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet