iDreamPost
android-app
ios-app

ఆసుపత్రిలో ఆర్ నారాయణ మూర్తి.. ఆరోగ్యంపై అభిమానులకు విజ్ఞప్తి

  • Published Jul 17, 2024 | 10:09 PM Updated Updated Jul 17, 2024 | 10:09 PM

R Narayana Murthy: ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్యంపై అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

R Narayana Murthy: ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్యంపై అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

  • Published Jul 17, 2024 | 10:09 PMUpdated Jul 17, 2024 | 10:09 PM
ఆసుపత్రిలో ఆర్ నారాయణ మూర్తి.. ఆరోగ్యంపై అభిమానులకు విజ్ఞప్తి

నిరాడంబరుడు, సినిమానే లోకంగా జీవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టక్కుమని గుర్తొచ్చేది ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి మాత్రమే. కొంచెం సక్సెస్ వచ్చినా ఖరీదైన కార్లు, బంగ్లాలల్లో లగ్జరీ లైఫ్ కి అలవాటు పడే వారు ఉన్న ఈ రోజుల్లో ఎంత ఎదిగినా సామాన్యుడిలా జీవించే నటుడు ఒక్క ఆర్ నారాయణ మూర్తి మాత్రమే. వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. విప్లవ సినిమాల్లో నటించి పీపుల్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు ఆర్ నారాయణ మూర్తి. తాజాగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం గురించి అభిమానులకు విజ్ఞప్తి చేశారు ఆర్ నారాయణ మూర్తి.

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆర్ నారాయణ మూర్తి సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ బీరప్ప ఆధ్వార్యంలో నటుడు నారాయణ మూర్తికి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటున్నట్టు, కోలుకుంటున్నట్టు డాక్టర్లు వెల్లడించారు. ఇక ఆర్ నారాయణ మూర్తి అనారోగ్యానికి గురైన విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

ఆయన త్వరగా కోలుకోవాలంటూ భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో నారాయణ మూరి ఆందోళన చెందుతున్న అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు అభిమానులకు తెలియజేశారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని వెల్లడించారు. దేవుని దయవల్ల కోలుకుంటున్నానని తెలిపారు. పూర్తిగా కోలుకున్నాక త్వరలోనే అభిమానుల ముందుకొస్తానని చెప్పారు. కోలుకున్నాక ఆరోగ్యం గురించి అన్ని వివరాలు వెల్లడిస్తానని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం ఉక్కు సత్యాగ్రహం తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss