iDreamPost
android-app
ios-app

మంజుమ్మెల్ బాయ్స్ షోస్ నిలిపివేసిన PVR మల్టీప్లెక్స్.. ఎందుకంటే?

Manjummel Boys- PVR Multiplex: మలయాళం బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ మూవీ తెలుగు వర్షన్ కు పీవీఆర్ మల్టీప్లెక్స్ షాకిచ్చింది.

Manjummel Boys- PVR Multiplex: మలయాళం బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ మూవీ తెలుగు వర్షన్ కు పీవీఆర్ మల్టీప్లెక్స్ షాకిచ్చింది.

మంజుమ్మెల్ బాయ్స్ షోస్ నిలిపివేసిన PVR మల్టీప్లెక్స్.. ఎందుకంటే?

ఈ ఏడాది మలయాళం సినిమాలు పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ప్రేమలు అనే చిన్న సినిమాని కేవలం రూ.5 కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా రూ.135 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా కూడా మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమా రికార్డులను కొల్లగొట్టింది. అటు తెలుగులో కూడా మంజుమ్మెల్ బాయ్స్ మూవీ సంచలనం రేపుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇలాంటి తరుణంలో మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వర్షన్ రైట్స్ కొనుగోలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్ శశిధర్ రెడ్డికి షాక్ తగిలింది. పీవీఆర్ మల్టీప్లెక్స్ చైన్ లో మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలు నిలిపివేశారు.

పీవీఆర్ మల్టీప్లెక్స్ సంస్థ మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వర్షన్ సినిమా ప్రదర్శనను నిలిపివేసింది. తమ థియేటర్లలో మంజుమ్మెల్ బాయ్స్ సినిమా ప్రదర్శన రద్దు చేసింది. అందుకు కారణం కూడా వెల్లడించింది. మలయాళ నిర్మాతతో తమకు ఉన్న విభేదాల కారణంగా మంజుమ్మెల్ బాయ్స్ షోస్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మలయాళ నిర్మాతతో విభేదాలు ఉంటే తెలుగు వర్షన్ సినిమా ప్రదర్శన రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు.

పీవీఆర్ తీరు వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామంటూ వాపోయారు. ఇలా అర్థాంతరంగా షోస్ రద్దు చేయడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించారు. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలో ఇలా చేయడం ఏంటిని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శశిధర్ రెడ్డి పీవీఆర్ మల్టీప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సాయంత్రం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పీవీఆర్ వ్యవహరించిన తీరుపై, మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శన నిలిపివేయడంపై సమావేశం కానుంది.

మంజుమ్మెల్ బాయ్స్ సినిమా కేవలం మలయాళంలోనే రూ.200 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే తెలుగులో కూడా డబ్బింగ్ చిత్రంగా వచ్చి అనేక రికార్డులను కొల్లగొడుతోంది. పైగా ఈ సినిమా అనేది యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథ కాబట్టి ప్రేక్షకులు ఇంకా బాగా కనెక్ట్ అవుతున్నారు. 2006లో కొచ్చికి చెందిన 11 మంది సభ్యుల స్నేహితుల బృదం విహారయాత్రకు వెళ్తుంది. వాళ్లంతా కొడైకెనాల్ కు టూర్ కి వెళ్తారు. అక్కడ వాళ్లు గుణ కేవ్స్ కి వెళ్తారు. గుహలోని డేంజర్ ప్రదేశాలను వాళ్లు చూడాలి అనుకుంటారు. అటు వెళ్లొద్దని లోకల్ గైడ్ హెచ్చరించినా కూడా వినకుండా వెళ్తారు. అయితే వారిలో ఒకడు ఆ గుహలో చిక్కుకుపోతాడు. అతడిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ కూడా సాహసం చేయదు. మరి.. అతడిని కాపాడగలిగారా? అసలు అతను బతికే ఉన్నాడా? ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మంజుమ్మెల్ బాయ్స్ కథ.