iDreamPost
android-app
ios-app

పుష్పా.. పుష్పా సాంగ్ హుక్ స్టెప్ కొరియోగ్రాఫర్ ఎవరంటే?

Pushpa Song Hook Step Choreographer details: పుష్పా 2 సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైన విషయం తెలిసిందే. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఈ సాంగ్ సంచలనంగా మారిపోయింది. అయితే ఈ సాంగ్ లో షూతో వేసిన హుక్ స్టెప్ ఎవరు కొరియోగ్రఫీ చేశారో తెలుసా?

Pushpa Song Hook Step Choreographer details: పుష్పా 2 సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైన విషయం తెలిసిందే. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఈ సాంగ్ సంచలనంగా మారిపోయింది. అయితే ఈ సాంగ్ లో షూతో వేసిన హుక్ స్టెప్ ఎవరు కొరియోగ్రఫీ చేశారో తెలుసా?

పుష్పా.. పుష్పా సాంగ్ హుక్ స్టెప్ కొరియోగ్రాఫర్ ఎవరంటే?

పుష్పా.. పుష్పా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే రీసౌండింగ్ వస్తోంది. పుష్ప 2 కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక్క ఇండియాలోనే కాకుండా.. పలు దేశాల్లో ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. అందుకు ప్రధాన కారణం డీఎస్పీ కొట్టిన మ్యూజిక్ అయితే.. రెండోది మాత్రం బన్నీ వేసిన స్టెప్పులనే చెప్పాలి. మరీ ముఖ్యంగా శ్రీవల్లి పాటలో లాగా షూ తీసి వేసిన హుక్ స్టెప్ ఆడియన్స్ ని అల్లాడిస్తోంది. అయితే మరి.. అంతలా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఆ హుక్ స్టెప్ ని ఎవరు కొరియోగ్రాఫ్ చేశారో తెలుసా?

ప్రస్తుతం యూట్యూబ్ లో పుష్పా 2 మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా పుష్పా.. పుష్పా.. అంటూ ఊగిపోతున్నారు. 3 భాషల్లో ఒక పాట ట్రెండింగ్ లో ఉండటం ఇదే తొలిసారి అని మేకర్స్ చెప్తున్నారు. అలాగే తెలుగు వర్షన్ సాంగ్ అయితే ఇండియాలోనే కాకుండా.. బహ్రెయిన్ లో కూడా నెంబర్ 1గా ఉంది. అలాగే యూఏఈ, కువైట్, ఖతరాలో 3వ స్థానంలో, ఆస్ట్రేలియాలో 17వ ప్లేస్, సింగపూర్లో 21, యూకేలో 25వ ప్లేస్, కెనడాలో 26వ స్థానం, ఐర్లాండ్ లో 28వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ లెక్కలు చూసిన తర్వాత బన్నీ ఫ్యాన్స్ ఇదిసార్ మా పుష్పా రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సాంగ్ లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కు చాలా మంచి మార్కులు పడుతున్నాయి. అలాగే బన్నీ డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇంత వెయిట్ చేసినందుకు అల్లు అర్జున్ అదిరిపోయే ట్రీట్ తోనే వస్తున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్ లో కొరియోగ్రఫీకి మంచి అప్లాజ్ లభిస్తోంది. ఈ సాంగ్ కి శ్రేష్టీ వర్మ, విజయ్ పొలాకీ కొరియోగ్రాఫర్స్ గా వ్యవహరించారు. పుష్పా.. పుష్పా సాంగ్ లో అందరూ షూ స్టెప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ షూ స్టెప్ ని డిజైన్ చేసింది మరెవరో కాదు.. విజయ్ పొలాకీ. ఈ విషయాన్ని అతనే వెల్లడించాడు.

తాను డిజైన్ చేసిన హుక్ స్టెప్ ఉంది చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పుష్పా 2 మూవీ తర్వాత విజయ్ పోలాకీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు. ఈ పుష్పా 2 మూవీకి శ్రేష్టి వర్మ, విజయ్ పోలాకి, గణేశ్, ఆచార్య, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇంక సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో పుష్పరాజ్ క్యారెక్టర్ ని ప్రపంచస్థాయికి తీసుకెళ్తున్నారు. ఎర్ర చందనం సిండికేట్ మొత్తానికి పెద్దగా మారిపోతున్నాడు. ఈసారి అస్సలు తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపేశాడు. మరి.. విజయ్ పోలాకి డిజైన్ చేసిన ఈ హుక్ స్టెప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetkare girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis