iDreamPost
android-app
ios-app

పుష్ప 3 వినసొంపుగానే ఉంది కానీ !

  • Published Sep 07, 2025 | 11:32 AM Updated Updated Sep 07, 2025 | 11:32 AM

దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో మాటల్లో మాటగా సుకుమార్ పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉంటుందని చెప్పారు. ఈ మాట ఒక్కసారిగా బన్నీ ఆర్మీని యాక్టివ్ అయ్యేలా చేసింది. పుష్ప 2 సాధించిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. ఇదే ఊపులో పుష్ప 3 కనుక ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టేయొచ్చు అనే అనుకుంటున్నారు

దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో మాటల్లో మాటగా సుకుమార్ పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉంటుందని చెప్పారు. ఈ మాట ఒక్కసారిగా బన్నీ ఆర్మీని యాక్టివ్ అయ్యేలా చేసింది. పుష్ప 2 సాధించిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. ఇదే ఊపులో పుష్ప 3 కనుక ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టేయొచ్చు అనే అనుకుంటున్నారు

  • Published Sep 07, 2025 | 11:32 AMUpdated Sep 07, 2025 | 11:32 AM
పుష్ప 3 వినసొంపుగానే ఉంది కానీ !

దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో మాటల్లో మాటగా సుకుమార్ పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉంటుందని చెప్పారు. ఈ మాట ఒక్కసారిగా బన్నీ ఆర్మీని యాక్టివ్ అయ్యేలా చేసింది. పుష్ప 2 సాధించిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. ఇదే ఊపులో పుష్ప 3 కనుక ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టేయొచ్చు అనే అనుకుంటున్నారు. ఈ ఆలోచన బాగానే ఉంది. కానీ ఇది ఎంత వరకు సాధ్యం అనే విషయానికొస్తే అంత సులభం కాదని అర్ధమౌతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. 2027 వరకు సమయం పట్టొచ్చు. పైగా ఇది రెండు భాగాలూ అయితే ఇంకో రెండు మూడు సంవత్సరాలు పట్టినా సందేహం లేదు.

అప్పటికె రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రానున్న ప్యాన్ ఇండియా మూవీ కంప్లీట్ అవ్వొచ్చు. పైగా ఒకవేళ పుష్ప 3 కనుక ఫిక్స్ అయితే బన్నీ చాలా కాలం త్యాగం చేయాల్సి వస్తుంది. తన లుక్స్ బాడీ మ్యానరిజం ఇలా చాలా కష్టపడాలి. ఆల్రెడీ పుష్ప 1, 2 కోసం ఐదేళ్లు ఆల్రెడీ ఖర్చు చేసాడు. మల్లి అంత త్యాగం చేస్తాడా అనేది కూడా సందేహమే. అటు అల్లు అర్జున్ కూడా పుష్ప బ్రాండ్ తో కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తో నార్త్ ఆడియన్స్ కు దగ్గరవ్వాలని అనుకుంటున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ దర్శకులకు కూడా టచ్ లో ఉన్నాడట.

సో ఇలా ఎలా చూసుకున్నా పుష్ప 3 సందేహంగానే కనిపిస్తుంది. ఒకవేళ ఇవన్నీ దాటుకుని పుష్ప 3 కార్య రూపం దాలిస్తే మాత్రం ఫ్యాన్స్ కు పండగే. పైగా ఇప్పటివరకు టాలీవుడ్ లో మూడు భాగాలుగా వచ్చిన సినిమానే రాలేదు. సో ఇక ఏమౌతుందో చూడాలి. అటు రామ్ చరణ్ 17 అయ్యాక ఏ హీరోతో లాక్ అవ్వని సుకుమార్.. అన్నమాట ప్రకారం పుష్ప 3 కానీ తెరకెక్కించాడా ఇంకా హిస్టరీ క్రియేట్ చేసినట్టే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.