iDreamPost
android-app
ios-app

Sr NTR దానవీరశూరకర్ణ, లవకుశ తర్వాత స్థానం పుష్పరాజ్ దే.. ?

  • Published Nov 28, 2024 | 5:38 PM Updated Updated Nov 28, 2024 | 5:38 PM

ఇప్పటివరకు దాదాపు అన్ని సినిమాలు రెండున్నర నుంచి మూడు గంటల రన్ టైం తోనే వచ్చాయి. ఎప్పటినుంచో ఇలానే వస్తున్నాయి కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ ప్యాట్రన్ కు అలవాటు పడిపోయారు. ఎంత హీరోల మీద అభిమానం , సినిమాల మీద పిచ్చి ఉన్నా సరే మూడు గంటలకు మించి సినిమా చూడడం అంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇప్పటివరకు దాదాపు అన్ని సినిమాలు రెండున్నర నుంచి మూడు గంటల రన్ టైం తోనే వచ్చాయి. ఎప్పటినుంచో ఇలానే వస్తున్నాయి కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ ప్యాట్రన్ కు అలవాటు పడిపోయారు. ఎంత హీరోల మీద అభిమానం , సినిమాల మీద పిచ్చి ఉన్నా సరే మూడు గంటలకు మించి సినిమా చూడడం అంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది.

  • Published Nov 28, 2024 | 5:38 PMUpdated Nov 28, 2024 | 5:38 PM
Sr NTR దానవీరశూరకర్ణ, లవకుశ తర్వాత స్థానం పుష్పరాజ్ దే.. ?

ఇప్పటివరకు దాదాపు అన్ని సినిమాలు రెండున్నర నుంచి మూడు గంటల రన్ టైం తోనే వచ్చాయి. ఎప్పటినుంచో ఇలానే వస్తున్నాయి కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ ప్యాట్రన్ కు అలవాటు పడిపోయారు. ఎంత హీరోల మీద అభిమానం , సినిమాల మీద పిచ్చి ఉన్నా సరే మూడు గంటలకు మించి సినిమా చూడడం అంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ దర్శక నిర్మాతలు అంత లెంగ్త్ తో సినిమాలు తీస్తే.. అది ప్రేక్షకుల మీద భారం మోపినట్లే అవుతుంది. అందుకే ఇలా అన్ని కోణాలలో ఆలోచించి మూవీ షూట్ ఎంత టైం వచ్చినా కానీ.. లాస్ట్ లో కత్తెరకు పని చెప్పి మాక్సిమమ్ మూడు గంటల దగ్గర ఎండ్ చేసేస్తారు. కానీ కొంతమంది పని రాక్షసులు ఆడియన్స్ కు ఏం ఇవ్వాలని స్క్రిప్ట్ రాసుకుంటారో.. అది పూర్తిగా స్క్రీన్ మీద చూపించేవరకు నిద్రపోరు. ఇప్పుడు పుష్ప 2 విషయంలో లెక్కల మాస్టారు సుకుమార్ చేస్తున్నది ఇదే . ఇదంతా సరే ఇప్పుడు దీనిలో సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే..

ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎక్కువ రన్ టైం కలిగిన మూవీస్ లో మొదటి ప్లేస్ దక్కించుకున్న మూవీ.. సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ. ఈ సినిమా 3 గంటల 44 నిమిషాలతో అప్పట్లోనే బడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక దీని తర్వాత స్థానం దక్కించుకున్న మూవీ లవకుశ. ఇది కూడా అన్నగారిదే.. ఈ సినిమా రన్ టైం 3 గంటల 28 నిముషాలు. ఈ రెండు కూడా ఇండస్ట్రీలో బడా రికార్డ్స్ సృష్టించిన సినిమాలు. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్ని అత్యద్భుత సినిమాలు వచ్చినా కూడా.. ఇలాంటి భారీ రన్ టైం తో రాలేదు. ఆ తర్వాత ట్రెండ్ మారి పాన్ ఇండియా సినిమాల రేంజ్ కు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇక్కడ కూడా ఏ దర్శకుడు ఇలాంటి సాహసం చేయలేకపోయారు. హైయెస్ట్ రికార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్ సైతం 3 గంటల 5 నిమిషాలకే పరిమితం అయింది. కానీ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ సినిమాల తర్వాత.. 3 గంటల 21 నిమిషాలతో తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో.. ఒక రేర్ ఫీట్ ను సాధించడానికి పుష్ప రాజ్ ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడున్న ట్రెండ్ సెట్టర్స్ లో ఏ దర్శకుడు , ఏ హీరో తీసుకొని రిస్క్ ను బన్నీ సుకుమార్ తీసుకుంటున్నారు.

ఒక కమర్షియల్ సినిమాకు ఇంత లెంగ్త్ పెట్టడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఆఖరి నిమిషం వరకు సుకుమార్ షూటింగ్ చేసినా కూడా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా క్లీన్ అవుట్ పుట్ ఇచ్చాడని.. టాక్ వచ్చేసింది. కత్తెర వేసేందుకు ఎక్కడా ఛాన్స్ లేకుండా టైటిల్ నుంచి ఎండ్ కార్డ్స్ వరకు ఊరమస్ కంటెంట్ పుష్పలో ఉంటుందని సమాచారం. దర్శక నిర్మాతలతో పాటు మూవీ టీం అంతా కూడా దీనిని బలంగా నమ్ముతున్నారు. బహుశా కథపై వారికున్న నమ్మకమే.. సినిమా లెంగ్త్ తగ్గనివ్వలేదేమో. ఒకవేళ అనుకున్నట్లు సినిమా కనుక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే.. మిగిలిన దర్శకులు సుకుమార్ ను ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్ని ఆశలు అంచనాలు పెట్టుకున్న పుష్ప 2 ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.