జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చినా.. ఆ విషయంలో నిరాశే!

Jani Master: సినీ ఇండస్ట్రీలో చిన్న స్థాయి నుంచి పాన్ ఇండియా లెవెల్లో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెట్టిన కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు బెయిల్ వచ్చింది.

Jani Master: సినీ ఇండస్ట్రీలో చిన్న స్థాయి నుంచి పాన్ ఇండియా లెవెల్లో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెట్టిన కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు బెయిల్ వచ్చింది.

పాన్ ఇండియా స్థాయిలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు వచ్చాయి. జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ కేసు పెట్టడంతో పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు పంపారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ పిటీషన్ పెట్టుకున్నారు. దాదాపు 35 రోజుల తర్వాత జానీ మాస్టర్ కి గురువారం (అక్టోబర్ 24) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. దీంతో జానీ మాస్టర్ త్వరలోనే బయటకు వస్తారని అంటున్నారు. జానీ మాస్టర్ బెయిల్ పై వచ్చిన సంతోషంలో ఉన్న ఒక్క విషయంలో మాత్రం తీవ్ర నిరాశకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. విరాల్లోకి వెళితే..

లైంగిక ఆరోపణలపై అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు గురువారం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హై కోర్టు.  సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప – 2’  ఒకటి. ఈ సినిమాలో ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే పుష్పా చిత్ర యూనిట్ జానీ మాస్టర్ కి షాక్ ఇచ్చింది. గురువారం పుష్ప 2 రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మాతలు..ఆ సాంగ్ వేరే కొరియోగ్రాఫర్ తో కంపోజ్ చేయించామని చెప్పారు. మొత్తానికి పుష్ప 2 లో జానీ మాస్టర్ సాంగ్ కొరియోగ్రఫీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. పుష్ప 2 మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో వేరే కొరియోగ్రాఫర్ చేత్ సాంగ్ పూర్తి చేయించినట్లు నిర్మాతలు తెలిపారు.

జానీ మాస్టర్ వద్ద కొంత కాలంగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పని చేసింది ఓ యువతి. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నట్టు పోలీస్ కేసు పెట్టింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఫోక్సో చట్టం కింద నాన్ బెయిల్ కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి జానీ మాస్టర్ కొన్నిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. మొత్తానికి గోవాలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత జానీ మాస్టర్ ని విచారించారు పోలీసులు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ కి వరుసగా దురదృష్టం వెంటాడుతుంది.

బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు వచ్చింది. కానీ, అతనిపై లైంగిక, అత్యాచార కేసులు ఉండటంతో ఆ అవార్డు కాస్త క్యాన్సిల్ అయ్యింది. దానికి తోడు జానీ మాస్టర్ తల్లి అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలోనే ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. జానీ మాస్టర్ బెయిల్ పిటీషన్ విచారించిన కోర్టు ఆయనకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హై కోర్టు. జానీ మాస్టర్ జైలు నుంచి వచ్చి వెంటనే తన తల్లిని కలిసేందుకు వెళ్లారు. మరీ మీడియా ముందుకు వచ్చి ఏం విషయాలు మాట్లాడుతారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Show comments