Swetha
Pushpa 2 Break Even Details: పుష్ప 2 సినిమా గురించి అందరు ఎదురుచూస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సిక్వెల్ అని కచ్చితంగా చెప్పి తీరాల్సిందే. తెలుగు , హిందీ , బెంగాలీ , తమిళ్ ఇలా అన్ని జోన్స్ లో ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ టాపిక్ గా మారింది.
Pushpa 2 Break Even Details: పుష్ప 2 సినిమా గురించి అందరు ఎదురుచూస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సిక్వెల్ అని కచ్చితంగా చెప్పి తీరాల్సిందే. తెలుగు , హిందీ , బెంగాలీ , తమిళ్ ఇలా అన్ని జోన్స్ లో ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ టాపిక్ గా మారింది.
Swetha
పుష్ప 2 సినిమా గురించి అందరు ఎదురుచూస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సిక్వెల్ అని కచ్చితంగా చెప్పి తీరాల్సిందే. తెలుగు , హిందీ , బెంగాలీ , తమిళ్ ఇలా అన్ని జోన్స్ లో ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ టాపిక్ గా మారింది. పైగా అప్పుడే ఒక ట్రేడ్ మార్క్ నెంబర్ ని కూడా సెట్ చేసింది పుష్ప 2. 1000 కోట్ల కలెక్షన్స్ వస్తేనే గొప్ప అనుకునే ఈ రోజుల్లో.. ఏకంగా ఈ సినిమాకు 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు.. మూవీ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో. ఇక ట్రైలర్ తర్వాత అంచనాలు ఇంకాస్త పెరిగిన మాట వాస్తవమే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల విషయానికొస్తే. పుష్ప 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 220 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే తమిళనాడు 50 కోట్లు, కర్ణాటక 30 కోట్లు , కేరళ 20 కోట్లు , ఓవర్శిస్ 120 కోట్లు , నార్త్ లో 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తం మీద 640 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఇవి కాకుండా నాన్ థియేట్రికల్ బిజినెస్ లో.. డిజిటల్ రైట్స్ 275 కోట్లు , శాటిలైట్ రైట్స్ 85 కోట్లు , మ్యూజికల్ రైట్స్ 65 కోట్ల వరకు అమ్ముడుపోయాయి. మొత్తం మీద పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు 1065 కోట్లు. ఇది చిన్న నెంబర్ అయితే అసలు కాదు. ఈ లెక్కన ఓవరాల్ గా చూసినట్లయితే వరల్డ్ వైడ్ 1200 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టాల్సి ఉంటుంది. రికవరీ విషయానికొస్తే ఏపీ , తెలంగాణ లో 220 కోట్ల బిజినెస్ అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 350 కోట్ల గ్రాస్ , 220 కోట్ల షేర్ రాబట్టాల్సి వస్తుంది. ఇక్కడ చాలా ఈజీ గా రికవరీ అయిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 కి టికెట్స్ ప్రైజ్ తక్కువ అది కాకుండా బెనిఫిట్ , స్పెషల్ షోస్ కూడా ఏమి లేవు. కానీ ఇప్పుడు అలా కాదు సింగల్ స్క్రీన్ కు టికెట్ ప్రైజ్ పెంచే ప్లాన్ లో ఉన్నారు. అలాగే స్పెషల్ షోస్ బెనిఫిట్ షోస్ కూడా పడతాయి. అలాగే కాంపిటీషన్ కూడా లేదు. పైగా లాంగ్ వీకెండ్ కాబట్టి ఈజీగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక నార్త్ బెల్ట్ లో 200 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక్కడ వచ్చే కలెక్షన్స్ ఎక్కడా రావని ట్రేడ్ పండితుల అంచనా. నాలుగు వారాల వరకు అసలు జోరు తగ్గదని భావిస్తున్నారు. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం సుమారు 400 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి టాక్ పాజిటివ్ గా వచ్చిందంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. తమిళనాడు లో 50 కోట్లు కాబట్టి.. 100 కోట్ల గ్రాస్ , 80 నుంచి 90 కోట్ల షేర్ రాబట్టొచ్చు. కర్ణాటకలో 60 కోట్ల గ్రాస్ రాబట్టాలి. అలాగే కేరళలో 40 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. కేరళ , కర్ణాటక , నార్త్ లో పుష్ప 2 ప్రాఫిట్ జోన్ లోనే ఉంటుందని అంచనా. ఇక ఓవర్శిస్ లో బ్రేక్ ఈవెన్ అనేది టాక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అక్కడ 120 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. సుమారు 240 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన పుష్ప 2 సినిమా కథ మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో.. ఇప్పుడు కలెక్షన్స్ మీద కూడా అదే రేంజ్ లో టాక్ నడుస్తుంది. రిలీజ్ తర్వాత పుష్ప 2 సినిమా ఏ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నార. మాస్ సినిమాలకు హ్యుజ్ నెంబర్ లో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ పుష్ప 2 మాస్ మాత్రమే కాదు.. మాస్ కు స్వాగ్ ను యాడ్ చేయడంతో స్టార్స్ సైతం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా సినిమా వర్క్ అవుట్ అయితే కనుక అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం ఖాయం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.