iDreamPost
android-app
ios-app

పుష్ప 2 డైలాగ్ లీక్! ఈసారి థియేటర్స్ లో అరుపులే..

  • Author ajaykrishna Updated - 01:40 PM, Fri - 1 September 23
  • Author ajaykrishna Updated - 01:40 PM, Fri - 1 September 23
పుష్ప 2 డైలాగ్ లీక్! ఈసారి థియేటర్స్ లో అరుపులే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప.. ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. రీసెంట్ గా బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు. దీంతో అందరి దృష్టి పుష్ప సీక్వెల్ పై పడింది. అసలు పుష్ప 2 షూటింగ్ ఎలా జరుగుతుంది? ఎంతవరకు వచ్చింది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే విధంగా ఆరాలు తీయడం మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్.. ఇన్ స్టాగ్రామ్ టీమ్ తో కలిసి పుష్ప 2 సెట్ లవర్క్ ని.. షూటింగ్ వాతావరణం ఓ వీడియోలో చూపించి అందరిని సర్ప్రైజ్ చేశాడు.

పుష్ప 2 షూటింగ్ వాతావరణం చూడటమే బిగ్ సర్ప్రైజ్ అనుకుంటే.. కొత్తగా పుష్ప 2 నుండి డైలాగ్ లీక్ అయ్యిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఏకంగా పుష్ప 2 నుండి హీరో హీరోయిన్స్ మధ్య సంభాషణలు లీక్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 నుండి డైలాగ్ లీక్ అయ్యిందనే సరికి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అలెర్ట్ అయిపోయారు. ఆ లీకైన డైలాగ్ ఇదేనంటూ ఓ స్క్రిప్ట్ పేపర్ ని వైరల్ చేస్తున్నారు.

ఇంతకీ ఆ లీకైన డైలాగ్ ఏంటంటే.. కేశవకి పుష్ప సారీ చెప్పడం ఇష్టం లేదు.. ‘నేను చూసేది పుష్పనేనా’ అనుకుంటాడు. మామూలుగా పుష్ప తగ్గేదేలే అనుకునే స్వభావం. ఎవరికీ సారీ చెప్పేవాడు కాదు. అలాంటి పుష్ప సారీ ఎందుకు చెప్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ‘బాబు నీకు ఇష్టం వచ్చినట్టు చేస్కో.. మళ్లీ లాస్ట్ లో వచ్చి నువ్వు చెప్పమంటేనే చెప్పాను అని నన్ను అనకు’ అంటూ పుష్ప, శ్రీవల్లి మధ్య మాటలు సాగినట్లు అర్ధమవుతుంది. పేపర్ లో చివరి డైలాగ్.. ముందు నీకు, షెకావత్ కే గొడవ మచ్చా.. కానీ, ఇప్పుడు సిండికేట్ ఇన్వాల్వ్ అయింది” అని పుష్పతో కేశవ అన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ డైలాగ్స్ సినిమాలో ఉన్నాయా లేక ఫ్యాన్ మేడ్ అనేది తెలియదుగానీ.. నెట్టింట వైరల్ గా మారాయి. మరి పుష్ప 2 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet