iDreamPost
android-app
ios-app

పూరీకి ఏమైంది? ఇలా అయిపోయాడేంటి..

  • Published Nov 03, 2023 | 8:12 AM Updated Updated Nov 03, 2023 | 8:12 AM

ఆ సినిమా ప్లాపు తర్వాత పూరీ కొంత ఇబ్బందుల్లో పడ్డారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఛార్మీతో పూరీకి గొడవలు కూడా అయ్యాయన్న ప్రచారం జరిగింది.

ఆ సినిమా ప్లాపు తర్వాత పూరీ కొంత ఇబ్బందుల్లో పడ్డారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఛార్మీతో పూరీకి గొడవలు కూడా అయ్యాయన్న ప్రచారం జరిగింది.

  • Published Nov 03, 2023 | 8:12 AMUpdated Nov 03, 2023 | 8:12 AM
పూరీకి ఏమైంది? ఇలా అయిపోయాడేంటి..

టాలీవుడ్‌ ఇండస్ట్రీని ఏలిన దిగ్గజ దర్శకుల్లో పూరీ జగన్నాథ్‌ ముందు వరుసలో ఉంటారు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన హవా కొనసాగింది. ఎన్ని ప్లాపులు వచ్చినా.. పూరీ క్రేజ్‌ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఆయన సినిమాల కంటూ ఓ సపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. 2022లో విజయ్‌ దేవరకొండ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘లైగర్‌’ ప్యాన్‌ ఇండియా సినిమాగా విడుదలైంది. అయితే, భారీ అంచనాలను ఆ సినిమా అందుకోలేకపోయింది. అట్టర్‌ ప్లాపుగా నిలిచింది.

ఆ సినిమా ప్లాపు తర్వాత పూరీ కొంత ఇబ్బందుల్లో పడ్డారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఛార్మీతో పూరీకి గొడవలు కూడా అయ్యాయన్న ప్రచారం జరిగింది. తర్వాత అవన్నీ ఒట్టి పుకార్లేనని తేలింది. పూరీ ప్రస్తుతం సూపర్‌ హిట్‌ సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌ తీసే పనిలో ఉన్నారు. డబుల్‌ ఇస్మార్ట్‌ శంకర్‌గా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం  ఈ సినిమా షూటింగ్‌ శరావేగంగా జరుగుతున్నట్లు సమాచారం. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్న రెస్ట్‌ సమయంలో మాత్రం చిల్‌ అవుతున్నారు పూరీ, ఛార్మీలు.

తాజాగా, ఛార్మీ.. పూరీకి సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ సూర్యుడు ఉదయించినపుడు’’ అని రాసుకొచ్చారు. ఆ ఫొటోలో పూరీ లుక్‌ చాలా వెరైటీగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఆ ఫొటోలో పూరీ గుర్తుపట్టలేనట్లుగా ఉన్నారు. ఇక, ఆ ఫొటోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆయన అభిమానులు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూరీకి ఏమైంది? ఆరోగ్యం పాడైందా? అంటూ కంగారు పడుతున్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిసి ఊపరి పీల్చుకుంటున్నారు. మరి, పూరీ కొత్త లుక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş