iDreamPost
android-app
ios-app

Double Ismart: డబుల్‌ ఇస్మార్ట్‌ ట్రైలర్‌.. ఈ సారి సినిమాకు అదే హైలెట్‌ కానుందా?

  • Published Aug 05, 2024 | 8:25 AM Updated Updated Aug 05, 2024 | 8:25 AM

Double Ismart Trailer Review: పూరి జగన్నాథ్‌-రామ్‌ పోతినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న డబుల్‌ ఇస్మార్ట్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. మరి టాక్‌ ఎలా ఉందంటే..

Double Ismart Trailer Review: పూరి జగన్నాథ్‌-రామ్‌ పోతినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న డబుల్‌ ఇస్మార్ట్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. మరి టాక్‌ ఎలా ఉందంటే..

  • Published Aug 05, 2024 | 8:25 AMUpdated Aug 05, 2024 | 8:25 AM
Double Ismart: డబుల్‌ ఇస్మార్ట్‌ ట్రైలర్‌.. ఈ సారి సినిమాకు అదే హైలెట్‌ కానుందా?

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో.. రామ్‌ పోతినేని హీరోగా.. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్ర డబుల్‌ ఇస్మార్ట్‌. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. దాంతో చిత్ర బృందం.. ఆదివారం అనగా.. ఆగస్టు 4న డబుల్‌ ఇస్మార్ట్‌ ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తోన్న సంగతి తెలిసిందే. సేమ్‌ అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. విడుదల కోసం పూరి, రామ్‌ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇస్మార్ట్‌ శంకర్‌ విషయానికి వస్తే.. మెమరీ ట్రాన్స్‌ఫర్‌ కాన్సెన్స్ట్‌గా తెరకెక్కిన చిత్రం. దీనికి సీక్వెల్‌గా వస్తోన్న డబుల్‌ ఇస్మార్ట్‌ కూడా సేమ్‌ అదే కాన్సెప్ట్‌తో రానుంది. ఇక ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ట్రైలర్‌లో ఓ అంశం మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆ వివరాలు..

డబుల్‌ ఇస్మార్ట్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌ అవ్వడంతో.. మెంటల్‌నెట్‌, మ్యాడ్‌నెస్‌ డోస్‌ నెక్ట్స్‌ లెవల్‌కి చేరింది. ఇక డబుల్‌ ఇస్మార్ట్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని ఆదివారం వైజాగ్‌లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ట్రైలర్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌ స్టోరీ లైన్‌ని రివీల్‌ చేస్తోంది. సంజయ్‌ దత్‌ అమరత్వం కోసం.. ఓ ప్రయోగం చేస్తాడు. అదే డబుల్‌ ఇస్మార్ట్‌ బాడీలోకి తన మెమరీని ట్రాన్స్‌ఫర్‌ చేయడం. మరి ఈ ఇద్దరి మధ్య జరిగే వార్‌ ఎలా ఉండనుంది.. చివరకు ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారు అనేది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఇక సేమ్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ మాదిరిగానే డబుల్‌ ఇస్మార్ట్‌ క్లైమాక్స్‌ని కూడా శివలింగం వద్ద ప్లాన్‌ చేశారు. ఆ విజువల్స్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉన్నాయి.

double ismart trailer hilights

ఇక డబుల్‌ ఇస్మార్ట్‌ కమర్షియల్‌ హంగులతో సూపర్బ్‌గా ఉంది. లవ్‌ ట్రాక్‌, రొమాన్స్‌, పూరి మార్క్‌ మాస్‌, యాక్షన్‌ అంశాలతో ట్రైలర్‌ అభిమానులకు ఫీస్ట్‌లా ఉంది.. ఇక వన్‌లైనర్లు బుల్లెట్‌లా పేలాయి. పూరి టేకింగ్‌ చాలా స్టైలిష్‌గా ఉంది. రామ్‌ తన పవర్‌ ప్యాక్డ్‌ పెర్ఫార్మెన్స్‌తో డబుల్‌ ఎనర్జీని నింపాడు. ఇక బిగ్‌బుల్‌ పాత్రలో సంజయ్‌ దాత్‌ టెర్రిఫిక్‌ అండ్‌ స్టైలీష్‌ విలన్‌గా కనిపించనున్నాడు. ఇక కావ్య థాపర్‌ గ్లామర్‌ సినిమాకు హైలెట్‌గా నిలవనుంది.

అయితే ఇస్మార్ట్‌ శంకర్‌లో మిస్సైన సెంటిమెంట్‌, అంశాన్ని డబుల్‌ ఇస్మార్ట్‌లో ప్రధానంగా చూపించారు. మదర్‌ సెంటిమెంట్‌ డబుల్‌ ఇస్మార్ట్‌కు అదనపు బలంగా నిలవనుంది అంటున్నారు ట్రైలర్‌ చూసిన అభిమానులు. ఈ సారి అన్ని అంశాలను టచ్‌ చేస్తూ.. పూరి జగన్నాథ్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని.. ట్రైలర్‌ చూస్తే.. డబుల్‌ ఇస్మార్ట్‌.. పక్కా సూపర్‌ హిట్టు అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఆదివారం నాడు వైజాగ్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మీ ఇద్దరూ హాజరు కాలేదు. ఇక ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రామ్‌ మాట్లాడుతూ.. డబుల్‌ ఇస్మార్ట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap