Somesekhar
మెగాడాటర్ కొణిదెల నిహారిక నిర్మాతగా వ్యవహరించిన 'కమిటీ కుర్రోళ్లు' మూవీ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.
మెగాడాటర్ కొణిదెల నిహారిక నిర్మాతగా వ్యవహరించిన 'కమిటీ కుర్రోళ్లు' మూవీ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.
Somesekhar
ఇండస్ట్రీలో ఎంతో యంగ్ టాలెంట్ ఉంది. అయితే వారికి సరైన అవకాశాలు రాక, తమ నటనను నిరూపించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి టాలెంటెడ్ కుర్రాళ్లతో ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది మెగాడాటర్ కొణిదెల నిహారిక. ఆమె నిర్మాతగా వ్యవహరించిన కమిటీ కుర్రోళ్లు మూవీ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. మరిప్పుడు ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి.
యదు వంశీ డైరెక్షన్ లో నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ సినిమా ద్వారా ఏకంగా 20 మంది కొత్త నటీ, నటులను పరిచయం చేస్తున్నారు. సీనియర్ యాక్టర్ సాయి కుమార్ తో పాటుగా సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, ప్రసాద్ బెహరాతో పాటుగా మరికొంత మంది కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. పల్లెటూరు నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ప్రధానంగా ఊర్లో ఉండే క్యాస్ట్ ఫీలింగ్స్, మతం, రాజకీయాలు వల్ల స్నేహితులు ఎలా విడిపోయారు? వారి మధ్య గొడవలకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? చదువుల్లో రిజర్వేషన్ల పాత్ర లాంటి అంశాన్ని కూడా డైరెక్టర్ టచ్ చేసినట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది.
ప్రధానంగా ఈ మూవీలో ఫ్రెండ్స్ మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను మనసుకు హత్తుకునే విధంగా ఇందులో చూపించారని తెలుస్తోంది. జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ఆయుపట్టుగా తెలుస్తోంది. ఇక నటులు కొత్త వారు అయినప్పటికీ.. అద్భుతంగా యాక్ట్ చేశారు. జాతర సన్నివేశాలను కెమెరామెన్ అద్భుతంగా తెరకెక్కించాడు. విజువల్స్ అదరగొట్టాయి. సాధారణంగా ఏ ఊరిలో అయిన క్యాస్ట్ రాజకీయాలు, మత రాజకీయాలు ఉంటాయి. వాటిలోనుంచే డైరెక్టర్ ఈ కథను తీసుకున్నాడనిపిస్తోంది. కథకు తగ్గట్లుగానే అనుదీప్ దేవ్ సంగీతం అందించాడు. ట్రైలర్ చూస్తే.. ప్రొడ్యూసర్ గా నిహారిక సరైన కంటెంట్ నే ఎంపిక చేసుకుందని సినీ ప్రముఖులతో పాటుగా పండితులు ప్రశంసిస్తున్నారు. మరి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.