iDreamPost
android-app
ios-app

Puneeth Rajkumar : జేమ్స్ కు శాండల్ వుడ్ ఘనమైన నివాళి

  • Published Feb 26, 2022 | 4:56 PM Updated Updated Dec 18, 2023 | 5:12 PM

స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ వచ్చే నెల 17న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మార్చి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు.

స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ వచ్చే నెల 17న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మార్చి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు.

Puneeth Rajkumar : జేమ్స్ కు శాండల్ వుడ్ ఘనమైన నివాళి

చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఒకే స్టేజి మీద కనిపించబోతున్నట్టు బెంగళూరు మీడియా టాక్. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ వచ్చే నెల 17న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మార్చి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. దానికి ముఖ్య అతిథులుగా చిరు, తారక్ లు రాబోతున్నట్టు తెలిసింది. చనిపోక ముందే దీని షూటింగ్ పూర్తి చేసిన పునీత్ దురదృష్టవశాత్తు డబ్బింగ్ చెప్పలేకపోయారు. అన్నయ్య శివ రాజ్ కుమార్ ఆ బాధ్యతను తీసుకుని ఇటీవలే ఫినిష్ చేశారు. టీజర్ చివర్లో వినిపించిన గొంతు ఆయనదే.

ఇక జూనియర్ తో పునీత్ బాండింగ్ ఇప్పటిది కాదు. చక్రవ్యూహ సినిమా కోసం తారక్ తమన్ సంగీత దర్శకత్వంలో ఓ పాట పాడటం అది అక్కడ చార్ట్ బస్టర్ కావడం అభిమానులు మర్చిపోలేదు. చివరి చూపు సందర్భంగా తారక్ కదిలిపోయి కన్నీళ్లు పెట్టుకోవడం అందరూ చూశారు. సో తన రాక వెళ్ళిపోయిన ఆత్మీయుడికి ఒక చిన్న కానుకగా చెప్పొచ్చు. ఇక రాజ్ కుమార్ బ్రతికి ఉన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న చిరంజీవి కడనివాళి కోసం ప్రత్యేకంగా వెళ్లిన సంగతి తెలిసిందే. తర్వాత రామ్ చరణ్ స్వయంగా ఆ కుటుంబాన్ని ఓదార్చారు. సో ఇప్పుడు జేమ్స్ ఈవెంట్ ఈ రకంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేపే అవకాశాలు పెరిగాయి.

జేమ్స్ గ్రాండ్ రిలీజ్ కోసం కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారం ముందు రాధే శ్యామ్ వస్తున్నా సరే 17 నుంచి 23 దాకా పునీత్ మూవీ తప్ప కన్నడనాట ఇంకే చిత్రం విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. శాండల్ వుడ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారని అక్కడి విశ్లేషకులు అంటున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన జేమ్స్ ని తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో అందించబోతున్నారు. తనకు ఇక్కడ మార్కెట్ లేకపోయినా పునీత్ చేసిన మంచి  పనులు చివరి రోజుల్లో తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులు జేమ్స్ ని చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇతర బాషల నుంచి కూడా సెలబ్రిటీలు రాబోతున్నారట

Also Read : Radhe Shyam : టార్గెట్ మార్చుకుంటున్న ప్రభాస్ టీమ్

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobet