iDreamPost
android-app
ios-app

సలార్ సింగిల్ పార్ట్ ప్లాన్: ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన పృథ్వీరాజ్

  • Published Mar 23, 2024 | 11:19 AM Updated Updated Mar 23, 2024 | 11:20 AM

Salaar: ఈ స్టార్ యాక్టర్/డైరెక్టర్ ఆడుజీవితం: ది గోట్ లైఫ్ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడారు. నిజానికి సలార్ మొదటి భాగం సినిమా అసలు కథకు కేవలం పరిచయం లాంటిదే అని అన్నారు.

Salaar: ఈ స్టార్ యాక్టర్/డైరెక్టర్ ఆడుజీవితం: ది గోట్ లైఫ్ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడారు. నిజానికి సలార్ మొదటి భాగం సినిమా అసలు కథకు కేవలం పరిచయం లాంటిదే అని అన్నారు.

  • Published Mar 23, 2024 | 11:19 AMUpdated Mar 23, 2024 | 11:20 AM
సలార్ సింగిల్ పార్ట్ ప్లాన్: ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన పృథ్వీరాజ్

మలయాళ నటుడు, పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ స్టార్ యాక్టర్/డైరెక్టర్ ఆడుజీవితం: ది గోట్ లైఫ్ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడారు. నిజానికి సలార్ మొదటి భాగం సినిమా అసలు కథకు కేవలం పరిచయం లాంటిదే అని అన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు రెండు పార్ట్‌ల కథను ఒకే సినిమాగా చెప్పారని అన్నారు. సలార్ పార్ట్ 1లో ఉన్న క్లైమాక్స్ భాగం నిజానికి మొత్తం కథకి ఒక ఇంటర్వెల్ అయి ఉండేదని పృథ్వీరాజ్ చెప్పారు.

సలార్‌ని రెండు భాగాలుగా చేయమని ప్రశాంత్ నీల్‌ను తానే స్వయంగా కోరినట్లు పృథ్వీరాజ్ చెప్పారు. ఎందుకంటే సినిమా కథ ఎంతో డెప్త్ కలిగి ఉందని, అది సరైన విధంగా తెర పైకి రావాలంటే ఎక్కువ నిడివి కావాలని ఆయన అభిప్రాయ పడ్డారు.
సినిమాలో ఎంతో సమాచారం ఉందని చాలామంది ప్రేక్షకులు కూడా వ్యక్తిగతంగా తనతో వచ్చి చెప్పారని తెలిపిన పృథ్వీరాజ్, తను కూడా వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. సలార్ క్లైమాక్స్ లో దేవా మరెవరో కాదు శౌర్యాంగ తెగ వారసుడని వచ్చే ట్విస్టుకి ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. ఒకవేళ నిజంగా సినిమా సింగిల్ పార్ట్ అయి ఈ సీన్ ఇంటర్వెల్ లో వచ్చి ఉంటే మరింత భారీ రెస్పాన్స్ వచ్చి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంచితే సెకండ్ పార్ట్ లో దేవ – వరదరాజ మన్నార్ లు ప్రాణ స్నేహితుల నుండి బద్ధ శత్రువులుగా ఎలా మారారో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా సలార్: శౌర్యంగ పర్వం సీక్వెల్‌ ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సెకండ్ లుక్‌ చాలా బాగుంటుందని అంటున్నారు. ముఖ్యమైన తారాగణం కూడా షూటింగ్ లో పాల్గొన్టుంది. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. కల్కి సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ప్రభాస్, ఏకకాలంలో సలార్-2 తో పాటు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా కూడా చేస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş