iDreamPost
android-app
ios-app

ప్రాజెక్ట్ కె బిగ్ అప్డేట్.. ప్రభాస్ ధాటికి హాలీవుడ్ వణకడం పక్కా!

  • Author Soma Sekhar Updated - 01:48 PM, Sat - 24 June 23
  • Author Soma Sekhar Updated - 01:48 PM, Sat - 24 June 23
ప్రాజెక్ట్ కె బిగ్ అప్డేట్.. ప్రభాస్ ధాటికి హాలీవుడ్ వణకడం పక్కా!

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. టాలీవుడ్ హీరోలు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో మెుదటి స్థానం ఎవరిది అంటే నిస్సందేహంగా రెబల్ స్టార్ ప్రభాస్ దే అని చెప్పాలి. డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాలన్ని పాన్ ఇండియా సినిమాలే. మరే ఇతర హీరో చేతిలో ఇన్ని మూవీలు లేవు. సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, ఆదిపురుష్ లాంటి సినిమాలతో డార్లింగ్ అందరికంటే ముందున్నాడు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతన్న ప్రాజెక్ట్ కె నుంచి బిగ్ అప్డేట్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా భారీ యాక్షన్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ప్రాజెక్ట్ కె.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కలిసి జంటగా నటిస్తున్న సినిమా. బిగ్ బి అమితా బచ్చన్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా.. గతంలో విడుదల చేసిన మూవీ ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ఫస్ట్ లుక్ లో సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈసారి ఏకంగా ఇండియన్ సినిమా హాలీవుడ్ గోడను బద్దలు కొట్టే విధంగా ఉండబోతుందని మేకర్స్ ఇదివరకే చెప్పారు. అందుకు తగ్గట్లుగానే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె ను తీర్చిదిద్దుతున్నాడట.

ఇక ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ప్రాజెక్ట్ కె మోషన్ పోస్టర్ తో పాటు టైటిల్ ను అమెరికాలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన విషయాలను నాగ్ అశ్విన్ పరిశీలిస్తున్నాడట.  దీంతో హాలీవుడ్ గోడలను బద్దలు కొట్టేందుకు ప్రభాస్ రెడి అవుతున్నట్లు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈసారి ప్రభాస్ సినిమాతో హాలీవుడ్ వణకడం పక్కా అంటూ చెప్పుకుంటున్నా అభిమానులు. ఆదిపురుష్ తో వరల్డ్ వైడ్ గా బజ్ క్రియేట్ చేసిన డార్లింగ్.. ప్రాజెక్ట్ కెతో ఆ బజ్ ను ఇంకాస్త పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ప్రభాస్ తన ఫ్యాన్ బేస్ తో.. తన క్రేజ్ తో హాలీవుడ్ కే చెమటలు పట్టించడం ఖాయంగా ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet