iDreamPost
android-app
ios-app

Eagle: ‘ఈగల్’ చివరి 40 నిముషాలు కీలకం! లోకేష్ కనగరాజ్ స్టైల్ అట!

  • Published Feb 07, 2024 | 4:26 PM Updated Updated Feb 07, 2024 | 4:26 PM

మాస్ మహారాజ్ రవి తేజ నటించిన తాజా చిత్రం "ఈగల్". ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఈ క్రమంలో ఈ మూవీ గురించి వరుసగా అప్ డేట్స్ ను వింటూ వస్తున్నాం. అయితే, తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి మరో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

మాస్ మహారాజ్ రవి తేజ నటించిన తాజా చిత్రం "ఈగల్". ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఈ క్రమంలో ఈ మూవీ గురించి వరుసగా అప్ డేట్స్ ను వింటూ వస్తున్నాం. అయితే, తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి మరో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

  • Published Feb 07, 2024 | 4:26 PMUpdated Feb 07, 2024 | 4:26 PM
Eagle: ‘ఈగల్’ చివరి 40 నిముషాలు కీలకం! లోకేష్ కనగరాజ్ స్టైల్ అట!

మరో రెండు రోజుల్లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన “ఈగల్” సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. కాగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. అలానే, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఇప్పటికే సినిమాకు సంబందించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , మేకింగ్ వీడియో ఇలా వరుస అప్ డేట్స్ తో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ చిత్రం. అంతేకాకుండా మూవీ ప్రివ్యూ చూసి స్వయంగా రవి తేజ ఇచ్చిన రివ్యూతో “ఈగల్” చిత్రం పైన ఇంకాస్త ఆసక్తి నెలకొంది. దీనితో పాటు ఈ సినిమా టికెట్ ధరల విషయంలోనూ డేరింగ్ స్టెప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీ క్లైమాక్స్ చివరి నలభై నిముషాలు మరో లెవెల్ లో ఉండబోతుందంటూ.. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో.. ఈ వీడియో ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం “ఈగల్” మూవీ టీమ్ అంతా వరుస ప్రమోషన్లు, ఇంటర్వూస్ తో బిజీగా ఉన్నారు. మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ను కూడా ఎప్పటికపుడు ప్రకటిస్తూనే ఉన్నారు మేకర్స్. అలానే అటు సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి.. విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. దీనితో అభిమానులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈగల్’ సినిమాలోని చివరి నలభై నిమిషాల గురించి చెప్పుకొచ్చారు. “ఈగల్ సినిమా చివరి 40 నిముషాలు అదిరిపోతుంది. ఆ రేంజ్ క్లైమాక్స్ అస్సలు ఎవరూ ఊహించరు. బాహుబలి లో క్లైమాక్స్ ఎంత బాగుంటుందో.. దాంతో కంపేర్ చేయకపోయినా లోకేష్ కనగరాజ్ స్టైల్ లో.. హై లెవెల్ యాక్షన్ లా ఉంటుంది. క్లైమాక్స్ చూసి అంతా ఆశ్చర్యపోతారు. తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ క్వాలిటీతో సినిమా తీసాము”. అంటూ చెప్పుకొచ్చారు విశ్వ ప్రసాద్. దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక థియేటర్ లో విడుదల అయిన తర్వాత ఈ చిత్రం ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఇక రవి తేజ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ హీరో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పైన కూడా .. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ తరువాత డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం. ఇక మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న “ఈగల్”.. ప్రేక్షకుల అంచనాలు ఎంతవరకు నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి. మరి, తాజాగా విశ్వ ప్రసాద్ ‘ఈగల్’ సినిమా క్లైమాక్స్ కోసం చెప్పిన ఆసక్తికర విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom