iDreamPost
android-app
ios-app

Raja Saab: ‘రాజాసాబ్’ మా నష్టాలన్నీ తీరుస్తాడు.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Aug 29, 2024 | 10:10 PM Updated Updated Aug 29, 2024 | 10:10 PM

శ్రీ విష్ణు స్వాగ్ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ రాజాసాబ్ మూవీ మా నష్టాలన్నింటినీ తీరుస్తుందని పేర్కొన్నాడు.

శ్రీ విష్ణు స్వాగ్ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ రాజాసాబ్ మూవీ మా నష్టాలన్నింటినీ తీరుస్తుందని పేర్కొన్నాడు.

  • Published Aug 29, 2024 | 10:10 PMUpdated Aug 29, 2024 | 10:10 PM
Raja Saab: ‘రాజాసాబ్’ మా నష్టాలన్నీ తీరుస్తాడు.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా చిత్రాలు నిర్మిస్తూ దూసుకెళ్తున్న బ్యానర్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ స్టార్ హీరోలతో పాటుగా చిన్న హీరోల సినిమాలు కూడా నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో శ్రీ విష్ణు స్వాగ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీలతో పాటుగా మరికొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా స్వాగ్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభాస్ రాజాసాబ్ మూవీపై హైప్ ను పెంచేస్తున్నారు. లేటెస్ట్ గా స్వాగ్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. “రీసెంట్ గా మేము చేసిన ఓ సినిమా ఆడలేదు. కానీ ‘మనమే’ మూవీ మంచి ప్రాజెక్ట్ గా నిలవడమే కాక.. మాకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక మా నష్టాలన్నీ ప్రభాస్ రాజాసాబ్ తో తీరుస్తాడు. వచ్చే ఏప్రిల్ లో రాజాసాబ్ తో మీ ముందుకు వస్తాం” అని చెప్పుకొచ్చాడు ప్రొడ్యూసర్.

కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఇటీవలే రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ వచ్చింది. ప్రమోషన్లు హై రేంజ్ లో ఉండటంతో.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ.. విడుదల తర్వాత వాటిని అందుకోవడంలో మిస్టర్ బచ్చన్ పూర్తిగా విఫలం అయ్యింది. దాంతో నిర్మాతలకు నష్టాలు మిగలక తప్పలేదు. ఇక ఈ నష్టాలన్నింటినీ ప్రభాస్ రాజాసాబ్ మూవీతో తీరుస్తాడని గత కొన్ని రోజుల నుంచి చాలా నమ్మకంగా చెప్తూ వస్తున్నాడు టీజీ విశ్వప్రసాద్. ఇక ఆయన మాటలతో రాజాసాబ్ పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. డైరెక్టర్ మారుతీ కూడా అందుకు తగ్గట్లుగానే సినిమాను రూపొందిస్తున్నాడు. మరి రాజాసాబ్ తో తమ నష్టాలన్నీ తీరుతాయి అన్న ప్రొడ్యూసర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet