iDreamPost
android-app
ios-app

భోళా శంకర్ ప్లాప్ కి అసలు కారణం ఎవరో కాదు! నిర్మాత SKN స్పీచ్ వైరల్!

  • Author ajaykrishna Updated - 02:08 PM, Thu - 24 August 23
  • Author ajaykrishna Updated - 02:08 PM, Thu - 24 August 23
భోళా శంకర్ ప్లాప్ కి అసలు కారణం ఎవరో కాదు! నిర్మాత SKN స్పీచ్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు. సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, చిరుపై అభిమానం ఎప్పటికీ మారదని మరోసారి ప్రూవ్ చేశారు మెగా ఫ్యాన్స్. బాక్సాఫీస్ సినిమా ఫలితాలు తమ అభిమానానికి కొలమానం వేయలేవని చెప్పకనే చెప్పేశారు. ఒకటి కాకపోతే ఇంకోటి.. మెగాస్టార్ కెరీర్ లో చూడని హిట్సా.. ఇండస్ట్రీ చూడని బ్లాక్ బస్టర్సా. ఇటీవల మెగాస్టార్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్ కి ఇండస్ట్రీకి సంబంధించి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇటీవల బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత SKN మెగా సెలెబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్బంగా ఎస్.కే.ఎన్ బాస్ గురించి మాట్లాడి.. ఆ తర్వాత భోళా శంకర్ ప్లాప్ కి కారణం ఎవరు అనే విషయంపై తన అభిప్రాయం బయట పెట్టారు. మెగాస్టార్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా భోళా శంకర్. రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంలో అజిత్ నటించిన వేదాలం సినిమాకి ఇది రీమేక్. కాగా.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన భోళా శంకర్ ప్లాప్ అయ్యేసరికి మెగా ఫ్యాన్స్ అందరూ నిరాశకు గురయ్యారు. ఇకముందు రీమేక్స్ చేయకండి బాస్ అంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా మెగాస్టార్ పై ట్రోల్స్ కూడా వచ్చాయి. దీంతో మెగా ఫ్యాన్స్ మరింత కుంగిపోయారు.

ఇప్పుడు మెగా ఫ్యాన్ అయిన ఎస్.కే.ఎన్ అన్ని విషయాలపై మాట్లాడి.. ఫ్యాన్స్ కి బూస్ట్ ఇచ్చాడు. SKN మెగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఒక సినిమా బాగుంటే దాన్ని హిట్ చేసేది మనమే. సినిమా నచ్చకపోతే దాన్ని తొక్కేసేది కూడా మనమే. సినిమా అలా ఉంది, ఇలా అంది అని మనమే కామెంట్స్ చేస్తాం. ఇప్పుడున్న హీరోలకు కూడా.. ఈ ఏజ్ లో చిరంజీవి మన కోసం నటిస్తున్నారు. చిరు రీఎంట్రీ తర్వాత చాలా గ్లామర్ గా కనపడింది భోళా శంకర్ సినిమాలోనే. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయాం అంటే అది మన తప్పే. బాస్ రీమేక్ సినిమా చేయాలా, స్ట్రైట్ సినిమా చేయాలా అని ఎవడో చెప్తాడు, ఎవడో చెప్తే మనం నమ్మాలా. బాస్ కి తెలుసు ఎలాంటి సినిమా చేయాలో. మోకాలికి ఆపరేషన్ చేయించుకొని కూడా మన కోసం డ్యాన్సులు వేస్తున్నారు. బాస్ వెంటే మనం అంతా ఉండాలి. భోళా శంకర్ సినిమాని ఎవరు తొక్కలనుకున్నారో తెలుసు. మనం మళ్ళీ హిట్ కొడతాం.” అంటూ స్పీచ్ తో అందరిలో ఎనర్జీ ఇచ్చారు. ప్రస్తుతం ఎస్కేఎన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఎస్కేఎన్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş