iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్‌రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!

  • Published Aug 08, 2024 | 9:16 AM Updated Updated Aug 08, 2024 | 10:28 AM

Tollywood Producer: ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో వరుసగా పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Tollywood Producer: ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో వరుసగా పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

  • Published Aug 08, 2024 | 9:16 AMUpdated Aug 08, 2024 | 10:28 AM
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్‌రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబాల్లోనే కాదు, అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. వయోభారం, హార్ట్ ఎటాక్, క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. మరికొంతమంది సెలబ్రెటీలు తమ కెరీర్ సరిగా సాగకపోవడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు సినీ పరిశ్రమలో పలు సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె, శ్యాం ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి(62) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్యాం ప్రసాద్ రెడ్డి, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద కూతురు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా పలు చిత్రాలు, టెలివిజన్ షోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.బుల్లితెరపై జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, స్టార్ మహిళ, ఢీ షోకి మంచి ఆదరణ లభించింది. 1987లో ఎంఎస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ‘తలంబ్రాలు’ మూవీతో నిర్మాతగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. 1992 లో మల్లమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని స్థాపించి.. ఈ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మించారు. ప్రస్తుతం సుమ హూస్ట్ గా వ్యవహరిస్తున్న ‘సుమ అడ్డా’ లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు.. ఈ కామెడీ టాక్ షో బాగా పాపులర్ అయ్యింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss