iDreamPost
android-app
ios-app

దానికంటే తక్కువ నవ్విస్తే డబ్బులు వాపస్! నిర్మాతను ముంచదుగా..

  • Author ajaykrishna Updated - 01:13 PM, Wed - 27 September 23
  • Author ajaykrishna Updated - 01:13 PM, Wed - 27 September 23
దానికంటే తక్కువ నవ్విస్తే డబ్బులు వాపస్! నిర్మాతను ముంచదుగా..

ఇండస్ట్రీలో కడుపుబ్బా నవ్వించే సినిమాలు అరుదుగా వస్తున్నాయి. ఎందుకంటే.. ఈ మధ్య ఎలాంటి సినిమాలు తీసినా కాస్తో కూస్తో కామెడీ ఉండేలా చూసుకుంటున్నారు మేకర్స్. కొన్ని సినిమాలలో స్టోరీ పరంగా కామెడీ సాగితే.. కొన్ని పూర్తి కామెడీతో సాగుతుంటాయి. కొన్నాళ్ళుగా టాలీవుడ్ లో పూర్తి కామెడీ సినిమాలు వస్తున్నాయి గానీ.. ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోవడంలో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అలా సక్సెస్ అయిన వాటిలో జాతిరత్నాలు, డీజే టిల్లు ముందు వరుసలో ఉండగా.. సామజవరగమన, రంగబలి లాంటివి ఆ తర్వాత స్థానాలలో ఉంటాయి. అయితే.. డీజే టిల్లు నిర్మాత నుండి కొత్తగా మ్యాడ్ అనే సినిమా వస్తుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన మ్యాడ్ మూవీ.. అక్టోబర్ 6న రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ గట్టిగా జరుగుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా.. పలువురు కొత్తవాళ్లతో కలిపి తెరకెక్కింది మ్యాడ్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుండి ఇటీవల టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. టీజర్ ఇంటరెస్టింగ్ గా ఉండగా.. తాజాగా మూవీ టీమ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ హాజరు కాగా.. ఈ సందర్బంగా నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

నాగవంశీ మాట్లాడుతూ.. ‘జాతిరత్నాలు సినిమా కంటే ఒక్క శాతం ఈ సినిమా చూసి తక్కువ నవ్వామని ఎవరు చెప్పినా వాళ్లకి టికెట్ డబ్బులు వాపస్ ఇచ్చేస్తాను’ అని అన్నారు. అదే మాట ఆడియన్స్ కి కూడా వర్తిస్తుందని.. మ్యాడ్ మూవీ మిమ్మల్ని నవ్వించలేకపోతే తనకు ట్విట్టర్ లో మెసేజ్ చేయాలని, వాళ్లకు టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం నాగవంశీ మాటలు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో సినిమాపై కాంఫిడెన్స్ ఉండటం వరకు ఓకే గానీ.. నాగవంశీ వ్యాఖ్యలు ఓవర్ కాంఫిడెన్స్ లా అనిపిస్తున్నాయని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేగాక.. ఈ కాంఫిడెన్స్ వల్ల సినిమా ఏమాత్రం తేడా కొట్టినా మునిగే అవకాశం లేకపోలేదు. సో.. మ్యాడ్ నిర్మాత మాటలు ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. మరి నాగవంశీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş