iDreamPost
android-app
ios-app

హీరో అజిత్‌ నన్ను మోసం చేశాడు: ప్రముఖ నిర్మాత

హీరో అజిత్‌ నన్ను మోసం చేశాడు: ప్రముఖ నిర్మాత

ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాత రెహమాన్‌.. హీరో కిచ్చ సుదీప్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సుదీప్‌ తనకు ఇవ్వాల్సిన 35 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన తెరపైకి వచ్చింది. ఇండస్ట్రీలో వరుసగా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హీరో అజిత్‌ తనను మోసం చేశాడంటూ ప్రముఖ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఆరోపించారు. అజిత్‌ జెంటిల్‌మ్యాన్‌ కాదని, మోసగాడని ఆయన మండిపడ్డారు.

నిర్మాత మాణిక్యం నారాయణన్ మాట్లాడుతూ.. ‘‘ చాలా ఏళ్ల క్రితం అజిత్‌ నా దగ్గరి నుంచి డబ్బులు తీసుకున్నాడు. తన తల్లిదండ్రుల్ని మలేషియా పంపడానికి ఆయన నా దగ్గర ఆ డబ్బులు తీసుకున్నాడు. ఆయన నాతో సినిమా చేస్తానని చెప్పాడు. ఆ డబ్బుల్ని తన రెమ్యూనరేషన్‌లో కట్‌ చేసుకోమని అన్నాడు. కానీ, అజిత్‌ ఇప్పటి వరకు నాతో ఏ సినిమా తీయలేదు. నా డబ్బులు వెనక్కు తిరిగి ఇ‍వ్వలేదు. ఇప్పటి వరకు ఈ విషయం గురించే మాట్లాడలేదు. అతడు జెంటిల్‌మ్యాన్‌ కాదు.. మోసగాడు.

అతడికి మంచి కుటుంబం ఉంది. సినిమాకు 50 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అలాంటి అతడికి నన్ను మోసం చేయాల్సిన అవసరం ఏముంది? అజిత్‌తో సినిమాలు చేసి, ఏఎమ్‌ రత్నంతో పాటు చాలా మంది ప్రొడ్యూషర్లు అప్పుల పాలయ్యారు. వారిలో ఎవ్వరికీ అజిత్‌ సహాయం చేయలేదు’’ అని అన్నారు. కాగా, మాణిక్యం నారాయణన్ అజిత్‌ తనకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఇది వరకే చాలా సార్లు మాట్లాడారు. అయితే, అజిత్‌ తరపునుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరి, నిర్మాత మాణిక్యం నారాయణన్ అజిత్‌పై ఆరోపణలు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş