iDreamPost
android-app
ios-app

‘జైలర్ 2’ కోసం చెక్! డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చారా? బడ్జెట్ ఇచ్చారా..?

  • Author ajaykrishna Published - 02:44 PM, Wed - 27 September 23
  • Author ajaykrishna Published - 02:44 PM, Wed - 27 September 23
‘జైలర్ 2’ కోసం చెక్! డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చారా? బడ్జెట్ ఇచ్చారా..?

ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ హిట్ అయితే దానికి వెంటనే సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ప్లానింగ్ చేసేవారో లేదోగాని.. ఈ మధ్య కాలంలో సినిమా సూపర్ హిట్ అని టాక్ రావడమే ఆలస్యం.. వెంటనే సీక్వెల్ ఐడియా ఉందని అనౌన్స్ చేసేస్తున్నారు మేకర్స్. ఇప్పుడా జాబితాలో రీసెంట్ బ్లాక్ బస్టర్.. జైలర్ కూడా చేరిపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ యాక్షన్ మూవీ.. బాక్సాఫీస్ ని తిరగరాస్తూ ఏకంగా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వెరసి.. సినిమా నిర్మించిన సన్ పిక్చర్స్ కళానిధి మారన్ కి ఊహించని లాభాలు వచ్చి పడ్డాయి. దర్శకుడు నెల్సన్ కుమార్ తెరకెక్కించిన జైలర్ మూవీ.. రజినీని చాలా గ్యాప్ తర్వాత బూస్ట్ నిచ్చిందని చెప్పాలి.

ఇక ఆగష్టు 10న భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన జైలర్.. ఫ్యాన్స్ అంచనాలు అందుకొని బాక్సాఫీస్ ని ఊచకోత కోసింది. రూ. 125 కోట్ల వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన జైలర్.. తలైవార్ క్రేజ్ కి, పాజిటివ్ టాక్ తోడు అవ్వడంతో కేవలం నాలుగు రోజుల్లోనే టార్గెట్ పూర్తి చేసి లాభాల బాట పట్టింది. సూపర్ స్టార్ రజినీతో పాటు సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్.. స్టార్ హీరోయిన్ తమన్నా, రమ్యకృష్ణ కీలక పాత్రలలో నటించారు. థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు మంచి కామెడీ జోడించి నెల్సన్ జైలర్ సినిమాని రూపొందించాడు.

కాగా.. జైలర్ రిలీజ్ అయ్యాక నెల్సన్ తన వద్ద జైలర్ 2కి ఐడియా రెడీగా ఉందని చెప్పిన సంగతి గుర్తుందా.. ఇప్పుడదే నిజం కాబోతుంది. జైలర్ సక్సెస్ ని ప్రొడ్యూసర్ నెక్స్ట్ లెవెల్ లో సెలెబ్రేట్ చేశారు. రజినీతో పాటు నెల్సన్, అనిరుధ్ లకు ఖరీదైన కార్లతో పాటు చెక్కులు కూడా అందించారు. అయితే.. అది జైలర్ సక్సెస్ తో ఇచ్చారు. కట్ చేస్తే.. ఇప్పుడు మళ్ళీ నెల్సన్ కి కొత్త చెక్ ఇచ్చారు నిర్మాత. ఎందుకంటే.. జైలర్ సీక్వెల్ కోసం అడ్వాన్స్ అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జైలర్ సీక్వెల్ కోసం అడ్వాన్స్ గా ఏకంగా రూ. 55 కోట్ల చెక్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో గానీ.. నెటిజన్స్ అయితే.. డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చారా? లేక సినిమాకు సంబంధించి సగం బడ్జెట్ ఇచ్చారా? అని కామెంట్స్ చేస్తున్నారు. మరి జైలర్ 2 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio