iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

  • Published Sep 09, 2024 | 10:23 AM Updated Updated Sep 21, 2024 | 3:24 PM

Star Producer Passed Away: ఈ మద్య మూవీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. దర్శక, నిర్మాతలు, సినీ ప్రముఖులు, ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొొంటుంది.

Star Producer Passed Away: ఈ మద్య మూవీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. దర్శక, నిర్మాతలు, సినీ ప్రముఖులు, ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొొంటుంది.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

సినీ పరిశ్రమలో ఈ మద్య కాలంలో వరుసగా విషాదాలు నిండుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే సెలబ్రెటీలు కన్నుమూయడంతో అటు వారి కుటుంబ సభ్యులు,ఇటు అభిమానులు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు ఎక్కువగా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు.. హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఈ మధ్యనే ఆదిపురుష్ నటి ఆశా వర్మ, నటుడు నిర్మల్ బెన్నీ, తమిళ యూట్యూబర్, కమెడియన్ బిజిలి రమేష్, బాలీవుడ్ నటుడు వికాస్ సేథి కన్నుమూశారు. ఈ విషాదాల నుంచి కోలుకోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడున్న ప్రమున నిర్మాత ఢిల్లీ బాబు  సోమవారం(సెప్టెంబర్ 9) ఉదయం హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన ప్రొడ్యూసర్ గా ఉన్నారు. యాక్సెస్ ఫిలిమ్ బ్యానర్ పై ఈయన తెరకెక్కించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి విజయం అందుకున్నాయి.  ఢిల్లీ బాబు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ తరుపున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికయ్యారు. ఓ వైపు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాలు నిర్మించారు. తమిళంలో ఆయన చాలా వరకు హర్రర్, కామెడీ నేపథ్యంలో ఉన్న సినిమాలే నిర్మించారు.

సూర్య హీరోగా రాక్షసుడు, ఆది పినిశెట్టితో తీసిన ‘మరకతమణి’, మిరల్, కాల్వన్, కుట్రమ్ కుట్రమే వంటి హర్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించాయి. కోలీవుడ్ లో హర్రర్ మూవీస్ నిర్మాతగా ఢిల్లీ బాబు కి మంచి పేరు ఉంది. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చరర్ నిర్మాత ఎస్ఆర్ ప్రభు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ బాబు లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నా.. ఎంతో మంది యువ కళాకారులకు అవకాశం ఇచ్చి సపోర్ట్ చేశారు. ఆయన మృతి ఇండస్ట్రీకి, రాజకీయ పరంగా పెద్ద నష్టం. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి’ అని తెలిపారు.