Dharani
Financial Assistance To Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. దీన స్థితిలో జీవితం వెళ్లదీస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రముఖ నిర్మాత ఫిష్ వెంకట్ కు అండగా నిలిచి ఆర్థిక సాయం అందజేశారు. ఆ వివరాలు..
Financial Assistance To Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. దీన స్థితిలో జీవితం వెళ్లదీస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రముఖ నిర్మాత ఫిష్ వెంకట్ కు అండగా నిలిచి ఆర్థిక సాయం అందజేశారు. ఆ వివరాలు..
Dharani
ప్రముఖ నటుడు, కామెడీ విలన్ ఫిష్ వెంకట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విలనీజంలో కామెడీ పండిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పదుల చిత్రాల్లో నటించారు. అయితే ఆయన గత కొంత కాలంగా వెండి తెర మీద కనిపించడం లేదు. బహుశా సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఉన్నట్లుండి తాజాగా ఫిష్ వెంకట్ తెర మీదకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఎంతటి దయనీయస్థితిలో ఉన్నారో తెలుసుకుని ప్రతి ఒక్కరు బాధ పడుతున్నారు.
ప్రస్తుతం ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఏడాదిన్నరగా పంజా గుట్ట నిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు ఫిష్ వెంకట్. తన దీన స్థితి గురించి ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఫిష్ వెంకట్. అతడి పరిస్థితి తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు ఫిష్ వెంకట్ కు అండగా నిలిచారు. ఆర్థిక సాయం అందజేశారు. ఆయనకు ధైర్యం తెలిపారు. ఆ వివరాలు..
తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఫిష్ వెంకట్ ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని రామ్ నగర్ లోని తన ఇంట్లోనే దయనీయ జీవితం గడుపుతున్నారు.ఈ నేపథ్యంలో నటుడు ఫిష్ వెంకట్ దీన పరిస్థితి చూసి చలించిపోయిన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. టీఎఫ్‌పీసీ ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ, సెక్రటరీ టి.ప్రసన్నకుమార్, దర్శకుడు కె.అజయ్ కుమార్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ లు చదలవాడ శ్రీనివాసరావు తరఫున ఫిష్ వెంకట్‌కు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. దీనిపై ఫిష్ వెంకట్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అడక్కుండానే తనకు ఇంత పెద్ద సాయం చేసిన నిర్మాతకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. చదలవాడ శ్రీనివాసరావు చేసిన మంచి పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.