iDreamPost
android-app
ios-app

పరుశురామ్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన బన్నీవాసు!

  • Published Nov 25, 2023 | 6:06 PM Updated Updated Nov 25, 2023 | 6:06 PM

పరుశురామ్‌తో తనకు ఉన్న వివాదంపై తాజాగా టాలీవుడ్‌ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. తన స్పందనతో పుకార్లకు చెక్‌ పెట్టారు. ఆయన మాట్లాడుతూ..

పరుశురామ్‌తో తనకు ఉన్న వివాదంపై తాజాగా టాలీవుడ్‌ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. తన స్పందనతో పుకార్లకు చెక్‌ పెట్టారు. ఆయన మాట్లాడుతూ..

  • Published Nov 25, 2023 | 6:06 PMUpdated Nov 25, 2023 | 6:06 PM
పరుశురామ్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన బన్నీవాసు!

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు పరుశురామ్‌ల మధ్య గత కొన్ని నెలలుగా వివాదాలు నడుస్తున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ సినిమా విషయంలో ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయని టాక్‌. ఇక, పరశురామ్ కు, తనకు మధ్య ఉన్న వివాదంపై బన్నీ వాసు మాట్లాడుతూ..‘‘ గీత గోవిందం తర్వాత పరశురామ్ నాతో ఓ కథ చెప్పాడు. ఆ కథ నాకు బాగా నచ్చింది. వెంటనే ఆ కథను విజయ్ కి కాల్ చేసి చెప్పాను. సినిమా చేసేందుకు విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కానీ, ఈలోపు దిల్ రాజుతో పరశురామ్ ఇదే కథ చెప్పినట్లు తెల్సింది. దిల్ రాజు బ్యానర్ లో అది చేస్తానని చెప్పాడు. ఈ విషయం నన్ను, అరవింద్ గారిని ఎంతగానో బాధించింది. పరశురామ్ ఈ విషయం మాతో సరిగా చెప్పలేదు. బయట వ్యక్తుల ద్వారా తెలియడంతో మేము కాస్త బాధపడ్డాం. ఆ సమయంలో మేమంతా చాల కోపంగా ఉన్నాం. దానికి తగినట్టే పరశురామ్ మీద రియాక్ట్ అయ్యాం. ఆ తర్వాత పరశురామ్ కాల్ చేసి ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చాడు.

సర్కారు వారి పాట సినిమా సందర్భంలో ఫ్లోలో దిల్ రాజుకు కథ చెప్పడం జరిగింది, విజయ్ కు కూడా కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఈ విషయం మీతో చెబుదాం అనుకునే లోపే ఇలా జరిగిపోయిందని వివరణ ఇచ్చాడు. ఇదే విషయంలో దిల్ రాజు గారు కాల్ చేసి, ఈ సినిమాలో వాటా కావాలంటే తీసుకో అన్నారు. కానీ అరవింద్ గారు వద్దని చెప్పారు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి గొడవ లేదు. త్వరలో పరశురామ్, విజయ్ కాంబినేషన్ లో సినిమా చేస్తాం’’ అని బన్నీ వాసు తెలిపాడు.

కాగా, గతంలోనూ ఇటువంటి సంఘటనే జరిగిందట. గీత గోవిందం మంచి విజయాన్ని సాధించడంతో పరశురామ్ అల్లు అరవింద్‌ బ్యానర్‌లో వరుస సినిమాలు చేసేందుకు కమిట్మెంట్ ఇచ్చేశాడట. వారి వద్ద అడ్వాన్స్ అమౌంట్ కూడా తీసుకున్నాడని వార్తలు వినిపించాయి. కమిట్‌మెంట్‌ను కాదని పరశురామ్ 14 రీల్స్ బ్యానర్ లో చిత్రం కోసం గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చేశాడట. ఆ తర్వాత సర్కారు వారి పాట మూవీ ఛాన్స్ రావడంతో 14రీల్స్ నుంచి మైత్రి మూవీ మేకర్స్ వైపు వెళ్ళిపోయాడట. ఓ సినిమా ఫంక్షన్లో అల్లు అరవింద్‌ పరుశురామ్‌పై బహిరంగంగానే పేరు చెప్పకుండా కామెంట్లు చేశారు. మరి డైరెక్టర్ పరశురామ్ కు, బన్నీ వాసుకు మధ్య జరిగిన వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom