Somesekhar
నిర్మాత అశ్విని దత్ కూతురు స్వప్నదత్ కల్కి 2898 AD మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మాటలు మూవీపై ఇంకాస్త అంచనాలను పెంచాయి.
నిర్మాత అశ్విని దత్ కూతురు స్వప్నదత్ కల్కి 2898 AD మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మాటలు మూవీపై ఇంకాస్త అంచనాలను పెంచాయి.
Somesekhar
‘కల్కి 2898’.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రం కోసం ఒక్క టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మే 9న వరల్డ్ వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ చిత్రం నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అవ్వకతప్పదు. దీంతో ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగాయి. తాజాగా మరోసారి హైప్ ను క్రియేట్ చేసింది ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూతురు స్వప్నదత్.
ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘కల్కి 2898’. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. ఆ విషయం పోస్టర్లు, గ్లింప్స్ చూస్తే ఎవ్వరికైనా అర్ధమవుతుంది. ఒక ఈ చిత్రం నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ ప్రేక్షకులతో పాటుగా సినీ ప్రముఖులను కూడా సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. తాజాగా సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ వేడుకలు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వప్నదత్ కల్కి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె వ్యాఖ్యలు మూవీపై హైప్ ను ఇంకాస్త పెంచాయి.
స్వప్నదత్ మాట్లాడుతూ..”కల్కిలో ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర అభిమానుల గుండెల్లో చాలా కాలం పదిలంగా ఉండిపోతుంది. ఈ చిత్రం ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అనుకున్న టైమ్ కే మే 9న కల్కి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. థియేటర్లో మూవీ చూస్తున్నంతసేపు ప్రేక్షకులు వేరే లోకంలోకి వెళ్లిపోతారు” అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ కల్కిపై అంచనాలను ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి. మహాభారతంలో మెుదలై 2898లో కల్కి మూవీ ముగుస్తుందని, హాలీవుడ్ చిత్రం బ్లెడ్ రన్నర్ తో పోలిక లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, భారతదేశం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎలా ఉంటోందో ఈ చిత్రంలో చూపించబోతున్నామని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపాడు. అందుకు తగ్గట్లుగానే సెట్స్ వేశామని వెల్లడించాడు.
ఇదికూడా చదవండి: ఓం భీమ్ బుష్ ఫస్ట్ డే కలెక్సన్లు ఎంతంటే..?