iDreamPost
android-app
ios-app

అందుకే సహజీవనం చేస్తున్నాం.. వింత రీజన్ చెప్పిన ప్రియాంక లవర్!

  • Published Feb 03, 2024 | 3:23 PM Updated Updated Feb 03, 2024 | 3:23 PM

Priyanka Jain, Shiva Kumar Clarity on Marriage: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్, సీరియర్ నటుడు శివ కుమార్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము పెళ్లి చేసుకోకుండా డేటింగ్ చేయడానికి వింత రీజన్ ఉందని చెప్పుకొచ్చారు. ఆ రీజన్ కు రివీల్ చేశాడు శివ కుమార్.

Priyanka Jain, Shiva Kumar Clarity on Marriage: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్, సీరియర్ నటుడు శివ కుమార్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము పెళ్లి చేసుకోకుండా డేటింగ్ చేయడానికి వింత రీజన్ ఉందని చెప్పుకొచ్చారు. ఆ రీజన్ కు రివీల్ చేశాడు శివ కుమార్.

అందుకే సహజీవనం చేస్తున్నాం.. వింత రీజన్ చెప్పిన ప్రియాంక లవర్!

ఇటు వెండితెర కావొచ్చు.. అటు బుల్లితెర కావొచ్చు.. నటీ, నటులు తమ సహ నటులతో ప్రేమలో పడటం సాధారణమైన విషయమే. ఇక ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలానే జరిగిన విషయం మనకు తెలియనిది కాదు. అయితే కొందరు నటీ, నటులు మాత్రం తమ ప్రేమ వ్యవహారాన్ని చాలా రోజుల వరకు మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడతారు. కానీ మరికొందరు మాత్రం డైరెక్ట్ గానే మేము ప్రేమలో ఉన్నామని కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. ఇలాగే తన ప్రేమను కూడా బయటపెట్టింది బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్. బిగ్ బాస్ సీజన్ 7లో తన ప్రియుడు శివ కుమార్ ను అందరికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక మేమిద్దరం డేటింగ్ చేస్తున్నామని ప్రియాంక చెప్పకనే చెప్పింది. అయితే ఈ జోడీ పెళ్లి చేసుకోకుండా ఇంకా డేటింగ్ అంటూ రోజులు గడుపుతోంది ఎందుకు? అంటూ నెటిజన్లు విమర్శలతో పాటుగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే తాము ఎందుకు డేటింగ్ చేస్తున్నామో వింత రీజన్ చెప్పుకొచ్చాడు ప్రియాంక లవర్ శివ కుమార్.

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, సీరియల్ నటుడు శివ కుమార్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న సంగతి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్ లో శివ కుమార్ ను హౌస్లోకి వచ్చాడు.. ఇక అక్కడు వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే హౌస్లో శివ కుమార్ ని పెళ్లి చేసుకుందామని ప్రియాంక అడిగింది. దానికి శివ కుమార్ కూడా తప్పకుండా హౌస్ నుంచి బయటకి వచ్చిన వెంటనే చేసుకుందాం అని ఆన్సర్ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ ముగిసి చాలా కాలం అవుతోంది. కానీ ఇంకా వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు.

PRIYANKA JAIN LOVER

దీంతో ఇంకెందుకు లేట్ పెళ్లి చేసుకోవచ్చుగా అని ఈ జోడీని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. ఇక నెటిజన్ల ప్రశ్నలకు వింత సమాధానం ఇచ్చింది ఈ జోడీ. ఆ సమాధానం విని నెటిజన్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంతకీ శివ కుమార్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, అంత డబ్బులు సమకూర్చుకోవాలంటే కాస్త టైమ్ పడుతుందని తెలిపింది ఈ జంట. అదీకాక తమ పెళ్లిని గ్రాండ్ గా కొన్ని రోజుల పాటు చేసుకోవాలని ఇద్దరూ భావిస్తున్నారట. అందుకు భారీగానే ఖర్చు అవుతుంది. దీంతో పెళ్లిని కొంత కాలం పాటు వాయిదా వేసి.. భారీగా సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుంటామని శివ కుమార్ తెలిపాడు. అప్పటి వరకు డేటింగ్ చేస్తామని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ ఆన్సర్ విన్న నెటిజన్లకు ఏమనాలో కూడా తెలియడం లేదు. ఏంటి సామి ఈ వింత రీజన్ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఘనంగా మ్యారేజ్ చేసుకోవడానికి మా దగ్గర అంత డబ్బు లేదని సో.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన కూడా చేశామని శివ కుమార్ అన్నాడు. శివ కుమార్ చెప్పిన ఈ వింత ఆన్సర్ అందరిని షాక్ కు గురిచేసింది. మరి ప్రియాంక జైన్-శివ కుమార్ పెళ్లి చేసుకోకపోవడానికి ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Miss Perfect Web Series Review: పెళ్లి తర్వాత లావణ్య చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘మిస్ ఫర్ ఫెక్ట్’ రివ్యూ!