iDreamPost

షూటింగ్ లో ప్రమాదం.. స్టార్ హీరోయిన్ కు గాయాలు!

తాజాగా ఓ మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో స్టార్ హీరోయిన్ మెడకు గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మరి షూటింగ్ లో గాయపడిన ఆ హీరోయిన్ ఎవరు?

తాజాగా ఓ మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో స్టార్ హీరోయిన్ మెడకు గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మరి షూటింగ్ లో గాయపడిన ఆ హీరోయిన్ ఎవరు?

షూటింగ్ లో ప్రమాదం.. స్టార్ హీరోయిన్ కు గాయాలు!

సినిమా షూటింగ్ లు చేస్తున్నప్పుడు, అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రెండు రోజుల క్రితం లెజెండరీ నటుడు కమల్ హాసన్ చిత్రం ‘థగ్ లైఫ్’ మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో జోజూ జార్జ్ కాలికి గాయమైంది. ఇక ఇప్పుడు మరో మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో స్టార్ హీరోయిన్ మెడకు గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు గాయాలు అయ్యాయి. ఓ మూవీ షూటింగ్ లో భాగంగా ఆమెకు స్వల్ప గాయాలు తగిలాయి. గత కొంత కాలంగా బాలీవుడ్ కు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ‘ది బ్లఫ్’ మూవీలో నటిస్తోంది. ఇందులో బాయ్స్ ఫేమ్ కార్ల్ అర్బన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఫ్రాంక్ E. ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. అక్కడ జరుగుతున్న షూటింగ్ లోనే ప్రియాంకకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆమె గొంతు మీద గాయాలు కనిపిస్తున్నాయి.

Priyanka Chopra

కాగా.. యాక్షన్ స్టంట్స్ చేస్తున్న సమయంలో ఈ గాయం అయినట్లు తన పోస్ట్ లో రాసుకొచ్చింది ప్రియాంక. దాంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొద్దిలో అయితే గొంతు తెగిపోయేదేగా మేడం.. జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు చిన్న గాయమేగా దానికి సోషల్ మీడియాలో షేర్ చేయాలా? అంటూ రాసుకొస్తున్నారు. కాగా.. గత కొంతకాలంగా ప్రియాంక బాలీవుడ్ కు దూరంగా ఉంటోంది. హాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టి.. అక్కడి చిత్రాల్లోనే నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి