iDreamPost
android-app
ios-app

ప్రియదర్శితో నాని సరికొత్త ప్రయోగం!

  • Published Jul 16, 2024 | 11:14 AM Updated Updated Jul 16, 2024 | 11:14 AM

ప్రియదర్శి-నభా నటేష్ జంటగా 'డార్లింగ్' మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ రిలీజ్ అవుతుండటంతో.. మూవీ టీమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. నాని ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరై.. ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రియదర్శి-నభా నటేష్ జంటగా 'డార్లింగ్' మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ రిలీజ్ అవుతుండటంతో.. మూవీ టీమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. నాని ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరై.. ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 16, 2024 | 11:14 AMUpdated Jul 16, 2024 | 11:14 AM
ప్రియదర్శితో నాని సరికొత్త ప్రయోగం!

ఇండస్ట్రీకి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత సోలో హీరోలుగా మారిన నటులు ఎంతో మంది ఉన్నారు. అందులో కమెడియన్ ప్రియదర్శి కూడా ఒకడు. పరిశ్రమకు హాస్యనటుడిగా అరంగేట్రం చేసి.. ప్రస్తుతం సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా దర్శి-నభా నటేష్ కీలక పాత్రల్లో నటించిన ‘డార్లింగ్’. డైెరెక్టర్ అశ్విన్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీ జూలై 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది మూవీ యూనిట్. ఈ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా నాని ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు.

ప్రియదర్శి-నభా నటేష్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ..”దర్శి అద్భుతమైన నటుడు. బలగం మూవీ చూసి అతడికి ఫ్యాన్ అయ్యాను. త్వరలోనే మా నిర్మాణ సంస్థలో దర్శిని హీరోగా పెట్టి ఓ మూవీని తెరకెక్కించబోతున్నాం. జగదీశ్ అనే ఓ కొత్త డైరెక్టర్ ను పరిచయం చేయబోతున్నాం. ఈ కథను, ఆ డైరెక్టర్ ను నా దగ్గరికి తీసుకొచ్చింది దర్శినే. జగదీశ్ స్టోరీ చెప్పిన తర్వాత మా బ్యానర్ లో మరో మంచి కథ, మంచి డైరెక్టర్ ను తీసుకురాబోతున్నాం అనే గొప్ప ఫీలింగ్ వచ్చింది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం” అని చెప్పుకొచ్చాడు.

కాగా.. నాని హీరోగా సినిమాలు చేయడంతో పాటుగా నిర్మాణ రంగంపై కూడా దృష్టి సారించిన విషయం తెలిసిందే. నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై పలు విభిన్నమైన చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలియనిదికాదు. అలాగే కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రియదర్శిని హీరోగా జగదీశ్ అనే ఓ కొత్త డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు. చిన్న చిత్రాలతో ప్రయోగాలు చేసే నాని.. మరోసారి దర్శితో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss