iDreamPost
android-app
ios-app

Prabhas: ‘రాజా సాబ్’ నుంచి క్రేజీ అప్డేట్! థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

  • Published Jul 16, 2024 | 9:47 AM Updated Updated Jul 16, 2024 | 10:40 AM

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదే నిజమైతే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదే నిజమైతే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 16, 2024 | 9:47 AMUpdated Jul 16, 2024 | 10:40 AM
Prabhas: ‘రాజా సాబ్’ నుంచి క్రేజీ అప్డేట్! థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కల్కి 2898 ఏడీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డార్లింగ్. ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్న విషయం తెలిసిందే. మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్, సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్, హను రాఘవపూడితో ఫౌజీ(వర్కింగ్ టైటిల్) చేస్తున్నాడు. మరోవైపు సలార్ 2 ఉండనే ఉంది. ఈ సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు రెబల్ స్టార్. ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

డైరెక్టర్ మారుతి.. హార్రర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడని సుధీర్ బాబుతో చేసిన ‘ప్రేమ కథాచిత్రమ్’తోనే నిరూపించుకున్నాడు. ఆ తర్వాత రూటు మార్చి కుటుంబ కథలతో అలరించాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ తో రాజా సాబ్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం అనౌన్స్ చేసిన దగ్గరనుంచి డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మా హీరోను మారుతి ఎలా చూపిస్తాడు? ప్రభాస్ కామెడీ టైమింగ్ కు మారుతి టేకింగ్ తోడైతే థియేటర్లలో నవ్వులు పూయడం ఖాయం. కాగా.. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. మారుతిపై బాధ్యత ఎక్కువైందనే చెప్పాలి. దాంతో రాజా సాబ్ కు మరిన్ని హంగులు అద్దాలని భావిస్తున్నాడట.

అందులో భాగంగానే రాజా సాబ్ లో ఓ సూపర్ హిట్ రీమిక్స్ సాంగ్ ను తీసుకోవాలని భావిస్తున్నాడట మారుతి. అయితే అది తెలుగు పాట కాదు. 1980లో హిందీలో వచ్చిన ఓ సూపర్ హిట్ పాత పాటను రీమిక్స్ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ ఆలోచన. ఇందుకోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హిందీలో రెండు మూడు సాంగ్స్ లో ఒక దాన్ని ఫైనల్ చేస్తారట. ముగ్గురు హీరోయిన్స్ తో ఓ స్పెషల్ సాంగ్ లా ఈ సాంగ్ ను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పాటకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటున్నారు మేకర్స్. అయితే అది ఏ పాట అన్నది ఇంకా తెలపలేదు మూవీ యూనిట్. కానీ బాలీవుడ్ బిగ్ అమితాబ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ‘ఓ కైకే పాన్ బనారస్ వాలా’ ని రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని మారుతికి మంచి ఫ్రెండ్ అయిన నిర్మాత SKN సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. కాగా.. రాజా సాబ్ కోసం డార్లింగ్ 50 రోజులు కేటాయించినట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని రోజులు షూట్ ముగిసిందని, మరికొన్ని రోజులు షూటింగ్ చేస్తే ప్రభాస్ పార్ట్ కంప్లీట్ అవుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet