iDreamPost
android-app
ios-app

పాకిస్తాన్ లో నాకు అభిమాన సంఘాలు ఉన్నాయి: ప్రియా ప్రకాష్

  • Author ajaykrishna Published - 08:57 AM, Mon - 17 July 23
  • Author ajaykrishna Published - 08:57 AM, Mon - 17 July 23
పాకిస్తాన్ లో నాకు అభిమాన సంఘాలు ఉన్నాయి: ప్రియా ప్రకాష్

ఇండియన్ యాక్టర్స్ కి పాకిస్తాన్ లో ఫ్యాన్స్ ఉంటారనే సంగతి తెలిసిందే. పాకిస్తాన్ కళాకారులకు ఇండియాలోను అభిమానులు ఉంటారు. పాకిస్తాన్ నుండి చాలామంది ఇండియాకి వచ్చి సెలబ్రిటీలుగా హోదాలు సంపాదించుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఫేమ్ అయిన పాకిస్తానీ సింగర్స్.. యాక్టర్లను చూశాం. అయితే.. ఇండియాలో ఏ దేశం వారినైనా టాలెంట్ ఉంటే ఇట్టే ప్రోత్సాహిస్తుంటారు. కానీ.. పాకిస్తాన్ లో ఫ్యాన్స్ ని సంపాదించు కోవాలంటే.. రేర్ గా జరుగుతుంటాయి. పాకిస్తాన్ లో ఇండియన్ యాక్టర్స్ కి ఫ్యాన్స్ ఉన్నారా అంటే.. చాలా తక్కువ. అక్కడ మన సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా అరుదుగానే జరుగుతుంది.

అలాంటిది కొత్తగా ఓ ఇండియన్ యంగ్ హీరోయిన్ కి పాకిస్తాన్ లో అభిమాన సంఘాలు ఉన్నాయంటే నమ్ముతారా? నమ్మక తప్పదు అంటోంది ఆ బ్యూటీ. కన్నుగీటిన వీడియోతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ఆ బ్యూటీ.. ప్రెజెంట్ హీరోయిన్ గా సరైన హిట్ కోసం ట్రై చేస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలిసిందిగా.. మలయాళం హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ బ్యూటీ గురించి ఇండియాలో పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆమె కన్ను గీటిన వీడియోనే సోషల్ మీడియాలో కావాల్సినంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ‘ఒరు అదార్ లవ్’ మూవీతో హీరోయిన్ గా మారిన ఈ భామ.. తెలుగులో చెక్ మూవీ చేసింది.

ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికి.. వివిధ భాషలలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది అమ్మడు. మరోవైపు సోషల్ మీడియాలోను హాట్ హాట్ ఫోటోషూట్స్.. బికినీ వీడియోస్ తో రచ్చ లేపుతోంది. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ మూవీతో మెప్పించడానికి రెడీ అవుతోంది. ఇలాంటి తరుణంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియా.. తనకు పాకిస్తాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని సర్ప్రైజ్ చేసింది. ఆ కన్నుగీటిన వీడియోతో ఇండియాలో నాకు చాలా క్రేజ్ దక్కింది. తెలుగులోను అంతే. కానీ.. అప్పుడే నాకు పాకిస్తాన్ లోను ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి తెలిసింది. కన్ను గీటిన వీడియో పాకిస్తాన్ లోని కుర్రకారుని కూడా అట్రాక్ట్ చేసింది. దానికి కనెక్ట్ అయిపోయి.. మీకోసం పాకిస్తాన్ లో అభిమాన సంఘాలు ఉన్నాయని చెప్పేవారు. వాళ్లు చెబుతుంటే నేను నమ్మలేకపోయేదాన్ని’ అంటూ తెలిపింది. ప్రస్తుతం ప్రియా మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ప్రియా వారియర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet