iDreamPost
android-app
ios-app

పృథ్వీరాజ్ ఇంత కష్టపడ్డాడా? నీ డెడికేషన్ ఏంటి సామీ.. హేట్సాఫ్

Aadujeevitham- Prithviraj Sukumaran: ఆడుజీవితం అనే ఒక అద్భుతమైన సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ ఏకంగా 16 ఏళ్లు కృషి చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని వెల్లడించాడు.

Aadujeevitham- Prithviraj Sukumaran: ఆడుజీవితం అనే ఒక అద్భుతమైన సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ ఏకంగా 16 ఏళ్లు కృషి చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని వెల్లడించాడు.

పృథ్వీరాజ్ ఇంత కష్టపడ్డాడా? నీ డెడికేషన్ ఏంటి సామీ.. హేట్సాఫ్

పృథ్వీరాజ్ సుకుమారన్.. పాన్ ఇండియా ఆడియన్స్ కి ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది మంది విలక్షణ నటులు ఉన్నారు. వారిలో పృథ్వీరాజ్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. ఇన్నేళ్లలో ఒక మంచి ఆర్టిస్టుగా ఎదగడం మాత్రమే కాదు.. ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇటీవల వచ్చిన సలార్ తో ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. ఈసారి గోట్ లైఫ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ పడ్డ కష్టం గురించి ప్రమోషన్స్ లో వెల్లడించాడు. అది విన్నాక ఆడియన్స్ కి పృథ్వీరాజ్ మీద అభిమానం మరింత పెరుగుతోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 16 ఏళ్లకు పైగా తెరకెక్కిన చిత్రంగా రికార్డులు కూడా సృష్టించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది ఇన్నేళ్లు ఆలస్యం అయ్యింది. పృథ్వీరాజ్ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఆ సినిమా కోసం ఇన్నేళ్లుగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ ఆడుజీవితం సినిమా మొత్తాన్ని పృథ్వీరాజ్ భూజాల మీద వేసుకుని పూర్తి చేసినట్లు అనిపిస్తుంది. ఇది ఒక సర్వైవర్ డ్రామా. దీనిని ఆస్కార్ కొట్టే సినిమా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా టాక్ స్టార్ట్ అయ్యింది. అలాంటి సినిమా మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

చిత్రబృందం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా పృథ్వీరాజ్ సహా టీమ్ ఇంటరాక్షన్ సెషన్ లో పాల్గొన్నారు. ఈ సినిమా గురించి పృథ్వీరాజ్ చాలా గొప్పగా చెప్పాడు. తనకు ఇప్పుడు 41 సంవత్సరాలు అని చెప్తూనే తన జీవితంలో 16 సంవత్సరాలు ఈ సినిమాతో ట్రావెల్ చేశాను అన్నారు. ఒక నటుడు తన జీవితంలో ఒక సినిమా కోసం ఇంత కృషి చేయడం నిజంగా ప్రశంసించాల్సిన అంశం అనే చెప్పాలి. ఒక హీరో అన్నేళ్లు కష్టపడ్డాడు అంటే ఆ సినిమాలో కచ్చితంగా విషయం ఉంటుందనే నమ్మకం కూడా ఆడియన్స్ లో కలుగుతోంది. ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు.

Pritviraj dedication towards goat life movie

ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఎలా చేశారు అని ప్రశ్నించగా.. పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ట్రాన్సఫర్మేషన్ గురించి అసలు విషయం వెల్లడించాడు. “నా ట్రాన్స్ ఫర్మేషన్ గురించి మాట్లాడటానికి ఇది చాలా మంచి నెల అని కూడా చెప్పాలి. నా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అంతా దాదాపుగా ఉపవాసంతోనే జరిగింది. మా సినిమా సెట్స్ లో డాక్టర్స్ కూడా ఉండేవారు. అత్యధిక బరువు ఉపవాసం నుంచే తగ్గాను. ఒక్కోసారి 72 గంటల వరకు కూడా ఏమీ తినకుండా ఉండేవాడిని. సరైన విధంగా, వైద్యుల పర్యవేక్షణలో బరువు తగ్గడానికి ఉపవాసం మంచి ఆప్షన్ కూడా” అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ తన ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ సీక్రెట్ ని బయటపెట్టాడు.

ఆడు జీవితం సినిమా కోసం పృథ్వీరాజ్ తన లైఫ్ లో అత్యధిక సంవత్సరాలు పని చేయడం మాత్రమే కాకుండా.. ఆ పాత్రకు తగినట్లు సన్నగా కనిపించడానికి రీల్ లైఫ్ లో మాదిరిగా.. రియల్ లైఫ్ లో కూడా తనని తాను ఇబ్బంది పెట్టుకున్నాడు. నిజంగా పృథ్వీరాజ్ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ప్రశంసించాలి. ఇప్పుడున్న హీరోలు ఎవరైనా బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ అంటే డైట్ తోనో.. వర్కౌట్స్ తోనే మారాలి అంటారు. కానీ, పృథ్వీరాజ్ మాత్రం ఉపవాసాలు ఉంటూ తగ్గిపోయాడు. అది కూడా ఏకంగా 72 గంటల వరకు కూడా ఉపవాశం ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత అభిమానుల్లో పృథ్వీరాజ్ మీద మరింత రెస్పెక్ట్ పెరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆడు జీవితం సినిమాపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.