Aditya N
విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.తెలిసిన స్టార్లు ఎవరూ లేకుండా ఒక మలయాళ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ స్థాయిలో వసూలు చేయడం విశేషమనే చెప్పాలి.
విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.తెలిసిన స్టార్లు ఎవరూ లేకుండా ఒక మలయాళ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ స్థాయిలో వసూలు చేయడం విశేషమనే చెప్పాలి.
Aditya N
మలయాళ రొమాంటిక్ కామెడీ ప్రేమలు బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తూనే ఉంది. ఫిబ్రవరి 9న విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నాలుగు వారాల పైనే తెలుగు రాష్ట్రాల్లో మలయాళ వెర్షన్ ఆడిన తరువాత ఈ సినిమాని తెలుగులో డబ్ చేశారు. తాజాగా ఈ సినిమా యూఎస్ లో 250k$ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.
ప్రేమలు విడుదలైన రోజే తెలుగులో నూతన దర్శకుడు విద్యాధర్ కగితా దర్శకత్వం వహించిన విశ్వక్ సేన్ గామి విడుదలై ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది, యు.ఎస్ లో మొదటి వీకెండ్ $575,059 కలెక్ట్ చేసి విశ్వక్ కెరీర్లోనే హాఫ్ మిలియన్ గ్రాసర్ గా ‘గామి’ నిలిచింది, అయితే మొదటి వారాంతం తరువాత ఈ సినిమా కలెక్షన్లు తగ్గి చాలా తక్కువ కలెక్షన్స్ తో మొదలైన ‘ప్రేమలు’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ యూఎస్ లో నెమ్మదిగా ఊపందుకుంది. సెకండ్ వీక్ రన్ మొత్తంలో తెలుగు సినిమా ‘గామి’ కలెక్షన్లను డామినేట్ చేసి ‘ప్రేమలు’ తెలుగు 250k$ వసూలు చేసింది. తెలిసిన స్టార్లు ఎవరూ లేకుండా ఒక మలయాళ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ స్థాయిలో వసూలు చేయడం విశేషమనే చెప్పాలి.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రేమలు తెలుగు డబ్బింగ్ రైట్స్ కొనుక్కుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తన వంతు కృషి చేశారు. యూత్ ను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు నుండే మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు వసూలు చేయడానికి దోహదపడింది. ‘ప్రేమలు’ లాంటి మలయాళ డబ్బింగ్ సినిమా స్ట్రెయిట్ సినిమాలని బీట్ చేయడం చాలా అరుదైన విషయమనే చెప్పాలి.