ప్రముఖ నటి ప్రీతి జింగానియా భర్తకు ప్రమాదం.. ICUలో చికిత్స

ప్రముఖ నటి ప్రీతి జింగానియా భర్త రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడ్ని హుటాహుటిన ముంబయిలోని బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ప్రముఖ నటి ప్రీతి జింగానియా భర్త రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడ్ని హుటాహుటిన ముంబయిలోని బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింగానియా భర్త పర్వీన్ దబాస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఉదయం ముంబయిలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన సమయంలో పర్వీన్ దబాసే కారు నడుపతున్నాడు. అతడ్ని హుటాహుటిన ముంబయిలోని బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.  కాగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన భార్య, నటి ప్రీతి జింగానియా అతనితో పాటు ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం. ఈ క్లిష్ట సమయంలో గోప్యతని పాటించాలని కుటుంబ సభ్యులు అధికారిక ప్రటకన విడుదల చేశారు. అలాగే భార్య ప్రీతి జింగానియా కూడా స్పందించింది.

‘నేను, నా కుటుంబం ప్రస్తుతం షాక్‌లో ఉన్నాం. ఏం మాట్లాడలేకపోతున్నాం. తెల్లవారు జామున నా భర్త ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తతం ఆయన కండిషన్ బాగోలేదని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షలు చేస్తున్నారు’అని పేర్కొంది. కాగా, ప్రీతి జింగానియా.. ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ప్రీతి.. ఒక్క మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత బాలకృష్ణ సరసన నరసింహ నాయుడు, మోహన్ బాబు అధిపతి, రాజేంద్ర ప్రసాద్ అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి చిత్రాల్లో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో ఓ పాటలో ఊర్వశిగా మెరిసింది.

విశాఖ ఎక్స్ ప్రెస్ త్వరాత తేజం అనే మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. అక్కడి నుండి తెలుగు సినిమాల్లో నటించలేదు ప్రీతి. హిందీలో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె.. చివరి సారిగా 2017లో రాజస్తానీ మూవీలో యాక్ట్ చేసింది. గత ఏడాది కఫస్ అనే వెబ్ సిరీస్ చేసింది. 2008లో డైరెక్టర్, యాక్టర్, మోడల్ పర్వీన్ దబాస్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు.. జై వీర్, దేవ్. పర్వీన్ అనేక హిందీ చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు. ‘దిల్లాగి’, ‘మాన్‌సూన్ వెడ్డింగ్’, ‘ఖోస్లా కా ఘోస్లా’, ‘ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై’, ‘మైనే గాంధీ కో నహీ మారా’, ‘యే హై జిందగీ’, ‘కుచ్ మీతా హో జాయే’, ‘ఇందు సర్కార్’, ‘రాగిణి MMS 2’ చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది శర్మజీ కీ భేటీ చిత్రంలో కనిపించాడు. 2011లో ‘సాహి దండే గలాత్ బందే’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.

Show comments