iDreamPost
android-app
ios-app

తారక్ ప్రశాంత్ నీల్ మూవీలో మరో హీరో.. అందుకోసమేనా!

  • Published Nov 11, 2024 | 4:12 PM Updated Updated Nov 11, 2024 | 4:12 PM

Prashanth Neel-NTR Update: ఎన్టీఆర్ వార్ 2 తో బిజీ బిజీగా ఉన్నాడు. అయిన వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేస్తుంది . ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

Prashanth Neel-NTR Update: ఎన్టీఆర్ వార్ 2 తో బిజీ బిజీగా ఉన్నాడు. అయిన వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేస్తుంది . ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Nov 11, 2024 | 4:12 PMUpdated Nov 11, 2024 | 4:12 PM
తారక్  ప్రశాంత్ నీల్ మూవీలో మరో హీరో.. అందుకోసమేనా!

మొత్తానికి ఎన్టీఆర్ సోలోగా దేవరతో పాన్ ఇండియా రేంజ్ లో కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నారు. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 లో నటిస్తున్నారు. ఇక్కడ కూడా డామినేషన్ తారక్ దే అని టాక్. అయాన్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడట. ఈ సినిమా ఎలాగూ లాస్ట్ స్టేజ్ కు వచ్చేసింది. సో దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా పట్టాలెక్కేస్తుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేశారంట. తారక్ 2025 జనవరి ఫెస్టివల్ తర్వాత నుంచి ఈ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లు టాక్. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా కథ గురించి కూడా ఇప్పటికే రకరకాల టాక్స్ వినిపించాయి.

రియల్ లైఫ్ మాఫియా డాన్ స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సినిమా స్టోరీ డెవలప్ చేశారట. ఇక ఈ సినిమాలో తారక్ కు జోడిగా కన్నడ భామ రుక్మిణీ వసంత్ పేరు బాగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో తారక్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడట. ఆ క్యారెక్టర్ కోసం ఓ స్టార్ హీరోని కూడా సంప్రదిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవ్వడంతో.. హీరో అయితే దానికి సూట్ అవుతాడని ఇలా ట్రై చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. అయితే నార్మల్ గా మాత్రం ఇది ఎన్టీఆర్ మూవీగానే ఉంటుందట. కానీ ఒక సపోర్టింగ్ రోల్ గా మాత్రం మరో హీరో ఉండే అవకాశం ఉందట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదట.

గతంలో కూడా ప్రశాంత్ నీల్ రోలర్ సినిమాలో ప్రభాస్ తో పాటు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ను కీలక పాత్రగా చూపించారు. దాదాపు అతని క్యారెక్టర్ సెకండ్ హీరో తరహాలోనే ఉంది. అయితే పార్ట్ 2 లో మాత్రం విలన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. సో ఇలానే ఇప్పుడు తారక్ సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ మరో హీరో క్యారెక్టర్ ను దించుతున్నాడేమో అనిపిస్తుంది. లేదంటే అదే క్యారెక్టర్ ను వేరే విధంగా చూపించిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమా కోసం ఎదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడు.  ఇక ఏమౌతుందో చూడాలి. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/