iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ ఊహించని డెసిషన్.. ట్రెండ్ కు భిన్నంగా మూవీ

  • Published Oct 09, 2024 | 11:47 AM Updated Updated Oct 09, 2024 | 11:47 AM

Prashanth Neel - NTR Movie: జూనియర్ ఎన్టీఆర్ కొరటాలతో హిట్ కొట్టేశాడు. ఇప్పుడు చక చకా తర్వాత సినిమాల కోసం పరుగులు పెట్టేస్తున్నాడు. పైగా నెక్స్ట్ మూవీస్ కోసం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా విషయంలో పెద్ద డెసిషన్ తీసుకున్నాడు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

Prashanth Neel - NTR Movie: జూనియర్ ఎన్టీఆర్ కొరటాలతో హిట్ కొట్టేశాడు. ఇప్పుడు చక చకా తర్వాత సినిమాల కోసం పరుగులు పెట్టేస్తున్నాడు. పైగా నెక్స్ట్ మూవీస్ కోసం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా విషయంలో పెద్ద డెసిషన్ తీసుకున్నాడు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Oct 09, 2024 | 11:47 AMUpdated Oct 09, 2024 | 11:47 AM
ప్రశాంత్ నీల్-  ఎన్టీఆర్  ఊహించని డెసిషన్.. ట్రెండ్ కు భిన్నంగా మూవీ

కొరటాల శివ తారక్ కాంబినేషన్ లో వచ్చిన దేవర సూపర్ హిట్ అయింది. అభిమానుల అతి భారీ అంచనాల వలన మొదట ఈ సినిమాకు డివైడ్ టాక్ వినిపించింది. కానీ షోస్ పడే కొద్దీ క్రమంగా టాక్ మారింది. దీనితో దేవర ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇప్పటికి థియేటర్స్ లో అదే జోరుతో కొనసాగుతుంది. దసరా వరకు తిరుగులేదు. అలాగే దేవర సెకండ్ పార్ట్ గురించి కూడా రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి. పార్ట్-1 కంటే కూడా పార్ట్-2 ప్రేక్షకులకు మరింత కిక్ ఇస్తుందంటూ బజ్ వినిపిస్తుంది. తారక్ దేవరతో ఒక ఆట ఆడేశాడు. ఇక ఇప్పుడు బ్రేక్ తీసుకోకుండా వెంటనే తర్వాత సినిమాల కోసం పరుగులు పెడుతున్నాడు. పైగా నెక్స్ట్ మూవీస్ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడు తారక్. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా విషయంలో.. చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నాడు. అదేంటో చూసేద్దాం.

తారక్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి రోజుకు ఒక న్యూస్ వినిపిస్తుంది. మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే.. సినిమాపై ఓ రేంజ్ లో హైప్ కొనసాగుతుంది. ప్రస్తుతం తారక్ వార్-2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఇది కంప్లీట్ అయినా వెంటనే.. ప్రశాంత్ నీల్ తో మూవీ స్టార్ట్ చేస్తాడు . ఆల్రెడీ ప్రశాంత్ నీల్ కూడా మూవీకి సంబంధించిన ప్రతి విషయాన్నీ చాలా పకడ్భందిగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి వినిపిస్తున్న కథ కూడా.. ఆడియన్స్ ను మైండ్ బ్లాక్ చేస్తుంది. అయితే ఇప్పుడు తారక్- నీల్ కలిసి ఈ మూవీ విషయంలో చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తున్న సిక్వెల్ ట్రెండ్ కు భిన్నంగా.. ఈ మూవీని సింగల్ పార్ట్ లో కంప్లీట్ చేయనున్నారట. అలాగే మూవీ రన్ టైం విషయంలో కూడా అనేక జాగ్రత్తలు వహించనున్నారని తెలుస్తుంది.

టాలీవుడ్ లో బాహుబలితో ఈ సిక్వెల్ ట్రెండ్ స్టార్ట్ అయింది. బాహుబలి పార్ట్-1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ తో ఎండ్ చేసి.. పార్ట్-2తో దానికి సమాధానం చెప్పాడు. ఇక ఆ తర్వాత చాలానే సిక్వెల్ సినిమాలు వచ్చాయి. కానీ ఏది కూడా బాహుబలి రేంజ్ సస్పెన్స్ ను అందుకోలేకపోయింది. దీనితో సిక్వెల్స్ పై కొంత నెగెటివ్ టాక్ మొదలైంది. ఇక ఇప్పడు విడుదలకు రెడీ గా పుష్ప-2 ఉంది. మరి ఇది ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. అలాగే దేవర-2 విషయంలో కూడా అక్కడక్కడ మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యేంతవరకు.. ఈ మూవీ విషయంలో ఒక అంచనాకు రాలేము. దీనితో ప్రశాంత్ నీల్- తారక్ కాంబోలో రాబోతున్న మూవీ విషయంలో.. ఎలాంటి నెగిటివిటికి స్కోప్ ఇవ్వకూడదని.. ఒకే పార్ట్ లో మూవీ కంప్లీట్ చేసే డెసిషన్ ను తీసుకున్నారు. ఇక ట్రెండ్ కు భిన్నంగా రాబోతున్న ఈ మూవీ.. ఎలాంటి స్టాండర్డ్స్ ను మైంటైన్ చేస్తుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş