Tirupathi Rao
ప్రస్తుతం ఎక్కడ చూసినా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి.. అతను తీసిన హనుమాన్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి.. అతను తీసిన హనుమాన్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.
Tirupathi Rao
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినిమా ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. సినిమా ప్రముఖులు కూడా ప్రశాంత్ వర్మ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక చిన్న డైరెక్టర్ అనే పేరు నుంచి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. నార్త్ లో కూడా అందరూ ఇప్పుడు హనుమాన్ జపమే చేస్తున్నారు. ఈ యంగ్ హైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా హనుమాన్ కలెక్షన్స్ చూస్తుంటే ట్రేడ్ పండితులకు కూడా తలలు గిర్రున తిరుగుతున్నాయి. ఒక చిన్ని సినిమా ట్యాగ్ తో వచ్చి గట్టిగానే కొట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ యంగ్ డైరెక్టర్ కి ఏకంగా రూ.1000 కోట్ల ఆఫర్ వచ్చిందంట.
ప్రశాంత్ వర్మ టాలెంట్, విజన్, టేకింగ్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ డైరెక్టర్ కి సరైన బడ్జెట్, సరైన స్టార్ కాస్ట్ ఇస్తే హాలీవుడ్ ని తలదన్నే సినిమా తీస్తాడు అంటూ కామెంట్స్ మొదలు పెడుతున్నారు. నిజానికి అంత బడ్జెట్ ఇస్తే ప్రశాంత్ వర్మ చేసి చూయించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతనికి అంత టాలెంట్ ఉందని ప్రేక్షకులు మాత్రమే కాదు.. నిర్మాతలు మొదలు ఇండస్ట్రీ మొత్తం అదే నమ్ముతోంది. అయితే ప్రశాంత్ వర్మకు అలాంటి ఒక ఆఫర్ కూడా వచ్చిందని స్వయంగా అతనే రివీల్ చేశాడు. ఒక ఎన్నారై తనకు కాల్ చేసి రూ.1000 కోట్ల బడ్జెట్ ఇస్తానని చెప్పాడంట. అయితే అందుకు షరతు కూడా పెట్టాడంట. సినిమా మాత్రం తప్పకుండా ఇతిహాసాల నేపథ్యంలోనే ఉండాలని చెప్పాడంట. ఆ జానర్ సినిమా తీసే పనైతే రూ.1000 కోట్లు అయినా బడ్జెట్ ఇస్తానని చెప్పినట్లు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.
అయితే ఆ ఎన్నారై ఎవరు? నిజంగానే ప్రశాంత్ వర్మ ఆ ఆఫర్ ని తీసుకుంటాడా? అసలు ఆ ఆఫర్ కి ఏం సమాధానం చెప్పాడు అన విషయాలు మాత్రం చెప్పలేదు. నిజానికి ప్రశాంత్ వర్మ ఆ ఆఫర్ ని ఓకే చేస్తారని చెప్పడానికి లేదు. ఎందుకంటే అతను మొత్తం 12 మంది సూపర్ హీరోల మీద సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అందులో భాగంగా తీసుకొచ్చిన హనుమాన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు హుమాన్ కి సీక్వెల్ గా జైహనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం కథ ఎప్పుడో సిద్ధం చేసినట్లు ఇటీవలే ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇంక త్వరలోనే జైహనుమన్ సినిమా కూడా పట్టాలెక్కపోతోంది. ఇది మాత్రమే కాకుండా.. అధీర సినిమా కూడా త్వరలోనే రాబోతోంది.
మొత్తం తన యూనివర్స్ లో ఉన్న సూపర్ హీరోలను ఒకరి తర్వాత ఒకరిని పరిచయం చేస్తూనే ఉంటాడు. జైహనుమాన్ కంటే ముందు అధీర మూవీ వస్తుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. తన చేతిలో అన్ని కథలు, అన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ప్రశాంత్ వర్మ ఆ రూ.వెయ్యి కోట్ల ఆఫర్ కి ఓకే చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అసవరం లేదు. ఇంక హనుమాన్ రికార్డుల విషయానికి వస్తే.. యూకే బాహుబలి 1 రికార్డును బ్రేక్ చేసింది. అలాగే 92 ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతికి బరిలో దిగి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా హనుమాన్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు హనుమాన్ రూ.275 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి.. ప్రశాంత్ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.