iDreamPost
android-app
ios-app

Prasanth Varma: ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లోకి బాలకృష్ణ?

హనుమాన్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌ వర్మ తీయబోయే సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

హనుమాన్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌ వర్మ తీయబోయే సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Prasanth Varma: ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లోకి బాలకృష్ణ?

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘ హనుమాన్‌’ సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని భాషల్లోనూ మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. జనం సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు, నటీనటులపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. అందరూ ఆయన తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తున్నారు.

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో తర్వాతి సినిమా చేసే హీరో ఎవరా? అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్‌ వర్మ తన తర్వాతి సినిమా బాలకృష్ణతో చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. ప్రశాంత్‌ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ బాలకృష్ణకు కథ చెప్పాను. అది కావాలంటే యూనివర్స్‌లో పెట్టొచ్చు. లేదంటే స్టాండ్‌ ఎలోన్‌గా చేయొచ్చు. అది పూర్తిగా బాలకృష్ణ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’’ అని అన్నారు.

prasanth varma with balakrishna

దీంతో ప్రశాంత్‌ వర్మ తర్వాతి సినిమా బాలకృష్ణతోటే ఉండబోతోందని ఫ్యాన్స్‌ డిసైడ్‌ అయిపోతున్నారు. బాలకృష్ణను సూపర్‌ హీరోగా ఊహించుకుంటూ తెగ ఖుషీ అవుతున్నారు. అయితే, ఈ సినిమా తెరపైకి రానుందా? లేదా? అన్నది తెలియాలంటే.. ఓ అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, హనుమాన్‌ సినిమాలో హీరో తేజ సజ్జకు జంటగా అమృత అయ్యర్‌ నటించారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌, సముద్ర ఖని, వెన్నెల కిశోర్‌, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రల్లో కనిపించారు.

ఇక, ఈ సినిమాకు సంబంధించి నిన్న సాయంత్రమే స్పెషల్‌ షోలు పడ్డాయి. ఆ షోలతోటే టాక్‌ బయటకు వచ్చింది. సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు కూడా హనుమాన్‌కు మంచి రివ్యూలు ఇచ్చారు. నార్త్‌లో అయితే, ఈ సినిమాకు అద్భుతమైన టాక్‌ వస్తోంది. హిందీ ప్రేక్షకులు మూవీని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్‌కు తిరుగు ఉండదు. రేపటి నుంచి షోలు పెరిగే అవకాశం కూడా ఉంది. మరి, ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో బాలకృష్ణ సినిమా ఉండబోతోందన్న వార్తపై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet