iDreamPost
android-app
ios-app

జై హనుమాన్ మూవీలో.. హనుమంతుడిగా హీరో యష్?

Yash As hanuman In Jai Hanuman: హనుమాన్ సూపర్ సక్సెస్ తర్వాత అందరూ జై హనుమాన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ మూవీకి సంబంధించి క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

Yash As hanuman In Jai Hanuman: హనుమాన్ సూపర్ సక్సెస్ తర్వాత అందరూ జై హనుమాన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ మూవీకి సంబంధించి క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

జై హనుమాన్ మూవీలో.. హనుమంతుడిగా హీరో యష్?

రిలీజై 20 రోజులు కావొస్తున్నా పాన్ ఇండియా లెవల్లో సినిమా లవర్స్ అందరూ హనుమాన్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా హనుమాన్ సినిమా సంచలనాలు సృష్టించింది. ఇప్పటికీ ఆడియన్స్ ఈ మూవీ ట్రాన్స్ లోనే ఉన్నారు. అంతేకాకుండా హనుమాన్ కి సీక్వెల్.. జై హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుంది అంటూ ఇప్పటి నుంచే ఎదురుచూపులు మొదలు పెట్టారు. పైగా అప్పుడప్పుడు జై హనుమాన్ గురించి ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా ఆడియన్స్ లో హైప్ ని పెంచేస్తున్నాయి. ఇప్పుడు జై హనుమాన్ కి సంబంధించిన ఒక క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

హనుమాన్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రశాంత్ వర్మ విజన్ కు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని చెబుతున్నారు. కానీ, జై హనుమాన్ మాత్రం తన సినిమాటిక్ యూనివర్స్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని ఇప్పటి నుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు. అంతటి హైప్ క్రియేట్ అవ్వడానికి ప్రశాంత్ వర్మ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఒక కారణంగా చెప్పచ్చు. ఇప్పటికే జై హనుమాన్ కోసం స్క్రిప్ట్ రెడీ అయ్యిందని ఈ యంగ్ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో రెండు కీలక పాత్రల కోసం స్టార్ హీరోల వేటలో ప్రశాంత్ వర్మ ఉన్నాడు. జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర, రాముడి పాత్ర కీలకంగా మారనున్నాయి. ఈ రెండు పాత్రల కోసమే ప్రశాంత్ వర్మ స్టార్ హీరోలను వెతుకుతున్నాడు.

ఇప్పటికే రాముడి పాత్ర కోసం మహేశ్ బాబు ఎలా ఉంటాడు అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపాడు. తన ఆఫీస్ లో రాముడి పాత్రలో మహేశ్ బాబు ఎలా ఉంటాడు అని స్కెచెస్ కూడా రెడీ చేసుకున్నాం అని చెప్పాడు. ఒకవేళ రాముడి పాత్రకోసం మహేశ్ ని ఫిక్స్ చేసుకుంటే.. హనుమంతుడు ఎవరు? అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం నెట్టింట పాన్ ఇండియా హీరో యష్ పేరు వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ టీమ్ హనుమాన్ క్యారెక్టర్ కోసం రాకీ భాయ్ ని సంప్రదించే యోచనలో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. నిజానికి అది గాసిప్ అయినా కూడా అభిమానుల్లో మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి.

కేజీఎఫ్ సినిమా తర్వాత యష్ కు పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. పైగా కేజీఎఫ్ 2 తర్వాత ఫ్యాన్స్ మళ్లీ యష్ ను స్క్రీన్ మీద చూడలేదు. ఇలాంటి ఒక పవర్ ఫుల్ హనుమంతుడి పాత్రలో యష్ కనిపిస్తే మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోతాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ నిజంగానే యష్ ని హనుమాన్ పాత్రకోసం ఒప్పిస్తే మాత్రం జై హనుమాన్ సినిమా మరో స్థాయికి వెళ్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే యష్ బాలీవుడ్ లో వస్తున్న రామాయణం సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. రావణాసురుడి పాత్రలో యష్ కనిపించబోతున్నాడు. మరి.. జై హనుమాన్ మూవీ విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి.. జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రలో యష్ కనిపిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.