iDreamPost
android-app
ios-app

‘స్పిరిట్’లో ప్రభాస్ క్యారెక్టర్ ఇదే.. హైప్ పెంచేసిన సందీప్ రెడ్డి సోదరుడు!

  • Published Dec 27, 2023 | 3:24 PM Updated Updated Dec 27, 2023 | 3:24 PM

Pranay Reddy Vanga On Spirit Movie: ప్రభాస్ సలార్ చిత్రం వరల్డ్ వైడ్ గా అన్నీ రికార్డులను బద్దలు కొడుతూ పోతోంది. ఈ నేపథ్యంలో ప్రణయ్ వంగా స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Pranay Reddy Vanga On Spirit Movie: ప్రభాస్ సలార్ చిత్రం వరల్డ్ వైడ్ గా అన్నీ రికార్డులను బద్దలు కొడుతూ పోతోంది. ఈ నేపథ్యంలో ప్రణయ్ వంగా స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Dec 27, 2023 | 3:24 PMUpdated Dec 27, 2023 | 3:24 PM
‘స్పిరిట్’లో ప్రభాస్ క్యారెక్టర్ ఇదే.. హైప్ పెంచేసిన సందీప్ రెడ్డి సోదరుడు!

సలార్.. ప్రస్తుతం సినిమా ప్రపంచాన్ని ఊపేస్తున్న సినిమా. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ కి సరైన క్యారెక్టర్ దక్కింది. స్క్రీన్ మీద ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చూ సినీ ప్రేక్షకులు ముచ్చటపడిపోతున్నారు. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ డైనాసార్ దెబ్బకు బాక్సాఫీస్ కూడా షేక్ అయిపోతోంది. ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్ ని టచ్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా సంబరాల్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే వార్త ఒకటి అందింది. ప్రభాస్ చేయబోయే స్పిరిట్ సినిమాకి సంబంధించి సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ అదిరిపోయే న్యూస్ చెప్పాడు. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ఒక క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పుడు అందరూ ప్రభాస్ సలార్ గురించే మాట్లాడుకుంటున్నారు. చాలాకాలం తర్వాత ప్రభాస్ రేంజ్ కి తగ్గ మూవీ పడింది అంటూ ఫ్యాన్స్ సంబర పడి పోతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభాస్ రాబోయో చిత్రాలకు సంబంధించి క్రేజీ క్రేజీ అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ‘కల్కీ 2898 ఏడీ’ సినిమా ఎలా ఉండబోతోందో అందరికీ క్లారిటీ ఉంది. అలాగే రాజా డీలక్స్ గురించి కూడా ఒక అంచనాకి వచ్చేశారు. కానీ, స్పిరిట్ గురించే ఎలాంటి అంచనాలు, అప్ డేట్స్ లేవు. కానీ, తాజాగా ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా స్పిరిట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

“ప్రభాస్ తన కెరీర్లోనే తొలిసారి పోలీసు డ్రెస్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగా చిత్రాల్లో హీరో పాత్రలు ఎలాగైతే ఉన్నాయో.. స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఒక యాంగ్రీ యంగ్ కాప్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతానికి హీరో క్యారెక్టర్ గురించి మాత్రమే చెప్పగలను. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభ అయ్యే అవకాశం ఉంది” అంటూ ప్రణయ్ కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఎందుకంటే.. ఇటీవల సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. పైగా సందీప్ సినిమాలో పాత్రలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.

అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల్లో హీరోకి ఉండే ఎలివేషన్స్ అంతా ఇంతా కాదు. అలాంటి ఒక పవర్ ఫుల్, ఎలివేటెడ్, సూపర్ కాప్ క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపించబోతున్నాడు అని చెప్పే సరికి అందరిలో జోష్ రెట్టింపు అయ్యింది. సలార్ తర్వాత కల్కీ, రాజా డీలక్స్, స్పిరిట్ చిత్రాలు ప్రభాస్ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్తాయి అంటూ ఆకాంక్షిస్తున్నారు. ఇంక ప్రభాస్ తర్వాతి సినిమాల విషయానికి వస్తే.. నాగ్ అశ్విన్ దర్వకత్వంలో వస్తున్న కల్కీ 2898 ఏడీ చిత్రం షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. అలాగే రాజా డీలక్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంక వచ్చే ఏడాది స్పిరిట్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. మరి.. స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ గురించి ప్రణయ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet